Budget Smartphones With Quality Camera | ఇటీవలి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ వాడకం ఎంతో విస్తృతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఫోన్లు కేవలం ఫోన్లు కాల్స్, మెసేజ్‌లకు మాత్రమే ఉపయోగించేవారు. కానీ, టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు స్మార్ట్‌ఫోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా గడపలేని స్థితి వచ్చింది. ముఖ్యంగా యువతలో కెమెరా ఫీచర్లపైనే దృష్టి కేంద్రీకరించి ఫోన్ ఎంపిక చేసుకోవడం కనిపిస్తోంది. ఈ పరిస్థితిలో కెమెరా పరంగా మార్కెట్‌లో ఉన్న టాప్ ఫోన్లపై ఓ లుక్ వేయండి.
వివో టీ4ఎక్స్ (Vivo T4X)
వివో అంటేనే కెమెరా ఫోన్లకు ఫేమస్. ఈ బ్రాండ్ సిరీస్ లో తాజాగా వచ్చిన మాడల్ వివో టీ4ఎక్స్. దీని ధర కేవలం రూ.13,999 మాత్రమే. మార్కెట్ లో అతి తక్కువ హై క్వాలిటీ కెమెరా అందిస్తున్న ఫోన్ లలో ఇది టాప్. ఇందులో 50 మెగాపిక్సెల్ పీడీఏఎఫ్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, అలాగే 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. అతి తక్కువ ధరలో 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేసుంది.
రియల్‌మీ పీ3 5జీ (Realme P3 5G)
కెమెరా పనితీరులో మంచి పాపులారిటీ కలిగిన మరో బ్రాండ్ రియల్ మీ. దీని ధర రూ.16,999. ఇందులో పీడీఏఎఫ్‌తో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కలిగి ఉంది. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ముందు భాగంలో అమర్చారు. 4కే వీడియో రికార్డింగ్ ఫీచర్ ఈ ఫోన్ లో ఉండడం ప్రత్యేకతం.
Also Read: ఐఫోన్ ప్రియులకు అలర్ట్..కొత్త ధరలు ఎప్పటి నుంచి పెరుగుతాయంటే..
రెడ్‌మీ నోట్ 14 (Redmi Note 14)
ఈ ఫోన్ ధర రూ.17,999. ఇందులో 50 మెగాపిక్సెల్ ఓఐఎస్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ద్వారా నాణ్యమైన ఫొటోలు తీసుకోవచ్చు.
పోకో ఎక్స్7 (Poco X7)
కెమెరా పనితీరు పరంగా ఇటీవలి కాలంలో అత్యుత్తమంగా నిలిచిన ఫోన్ ఇది. దీని ధర రూ.18,999. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్ ఓఐఎస్ తో, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కలిగి ఉంది. సెల్ఫీ కోసం 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్న ఈ ఫోన్ ద్వారా అద్భుతమైన ఫొటోలు తీయవచ్చు.
నథింగ్ ఫోన్ 2 ఏ (Nothing Phone 2A)
ఈ ఫోన్ ధర ప్రసుతం రూ.19,384. ఇందులో ఓఐఎస్ సాంకేతికతతో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా (వెనుకభాగం) ఉండగా, ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది. గైరో ఈఐఎస్ వ్యవస్థతో 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్ అందిస్తూ.. అధిక నాణ్యత గల డియోలను ఈ ఫోన్ ద్వాారా తీయగలరు.
తక్కువ బడ్జెట్ లో మంచి కెమెరా ఫీచర్లు, అద్భుతమైన వీడియో క్లారిటీ అందిస్తున్న ఫోన్లు ఇవే. మీ బడ్జెట్ కు తగట్టుగా ఎంపిక చేసుకోండి.