BigTV English

Better Sleep: రాత్రి పూట పదే పదే నిద్ర లేస్తున్నారా ? అయితే ఈ టిప్స్ మీ కోసమే !

Better Sleep: రాత్రి పూట పదే పదే నిద్ర లేస్తున్నారా ? అయితే ఈ టిప్స్ మీ కోసమే !

Better Sleep: ఈ రోజుల్లో..బిజీ లైఫ్ స్టైల , మానసిక ఒత్తిడి కారణంగా నిద్ర సంబంధిత సమస్యలు సర్వసాధారణంగా మారాయి. నిద్ర తగినంత లేకపోవడం శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా మానసిక స్థితి , రోజువారీ పనితీరుపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.


నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో ఒత్తిడి, ఆందోళన, అలసట వంటి సమస్యలు కూడా వస్తాయి. అందుకే మనం నిద్ర నాణ్యతపై శ్రద్ధ వహించడం, దానిని మెరుగుపరచడానికి కొన్ని చిట్కాలు పాటించడం ముఖ్యం. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్రను మెరుగుపరచడానికి కొన్ని సింపుల్ చిట్కాలు ఉన్నాయి. వీటిని మీరు ప్రతి రోజు ప్రయత్నించవచ్చు. ఈ టిప్స్ మీ శరీరానికి విశ్రాంతిని ఇవ్వడమే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా అందిస్తాయి. మీరు నిద్ర సంబంధిత సమస్యలతో కూడా ఇబ్బంది పడుతుంటే.. గనక వీటి ద్వారా మీ నిద్ర నాణ్యతను మెరుగు పరచుకోవచ్చు.


మంచి నిద్ర కోసం చిట్కాలు:

వేడి పాలు, పసుపు:
వేడి పాలలో పసుపు కలిపి తాగడం ఒక ప్రభావ వంతమైన మార్గం. పాలలో కాల్షియం ఉంటుంది. కాబట్టి ఇది నాడీ వ్యవస్థను ప్రశాంతంగా మారుస్తుంది. అంతే కాకుండా పసుపులో శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని విశ్రాంతిని అందిస్తాయి. రాత్రి పడుకునే ముందు ఒక కప్పు వేడి పాలలో అర టీస్పూన్ పసుపు కలిపి తాగడం వల్ల గాఢ నిద్రలోకి జారుకుంటారు. అంతే కాకుండా ఉదయం తాజాగా ఉంటారు.

రాతి ఉప్పు, నీరు:
రాతి ఉప్పు వాడకం కూడా నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రాతి ఉప్పులో ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరం యొక్క అయాన్ సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడతాయి. అందుకే నిద్రపోయే ముందు గోరు వెచ్చని నీటిలో చిటికెడు రాతి ఉప్పు కలిపి తాగడం వల్ల శరీరం విశ్రాంతి పొందుతుంది. అంతే కాకుండా మీకు మంచిగా నిద్ర పడుతుంది. ఫలితంగా శరీర అలసట కూడా తొలగిపోతుంది.

లావెండర్ ఆయిల్ వాడకం:
లావెండర్ ఆయిల్ వాసన త్వరగా నిద్ర పట్టేలా చేస్తుంది. అంతే కాకుండా ఇది మానసిక ప్రశాంతతను అందిస్తుంది. నాడీ వ్యవస్థను ప్రశాంత పరుస్తుంది. మీరు మీ దిండుపై కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ వేసుకుని నిద్ర పోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిని గదిలో ఎయిర్ ఫ్రెషనర్‌గా స్ప్రే చేయవచ్చు. లావెండర్ యొక్క మంచి వాసన నిద్రను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.

లోతైన శ్వాస :
లోతైన శ్వాస , ప్రాణాయామం వంటివి నిద్రను మెరుగుపరచడంలో సహాయపడతాయి. రాత్రి పడుకునే ముందు.. కొన్ని నిమిషాలు గాఢంగా శ్వాస తీసుకుని ఏకాగ్రత పెట్టడానికి ప్రయత్నించండి. ఇది శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడంలో, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా గాఢమైన నిద్రను ప్రేరేపిస్తుంది. గాఢంగా శ్వాస తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ ప్రశాంతంగా ఉంటుంది. అంతే కాకుండా మనస్సు కూడా రిలాక్స్‌గా ఉంటుంది.

Also Read: మీ వంటగదిలో ఉండే.. ఈ వస్తువుల వల్ల క్యాన్సర్‌ వస్తుంది తెలుసా ?

టీ ఆకులు, అల్లం:
అల్లం , టీ ఆకులు నిద్రను మెరుగు పరిచే మరొక ఇంటి నివారణ. అల్లం శరీరానికి విశ్రాంతినిచ్చే సహజ లక్షణాలను కలిగి ఉంటుంది. అందుకే రాత్రి పడుకునే ముందు అల్లం టీ తాగడం వల్ల నిద్ర బాగా పట్టడమే కాకుండా జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అల్లం, పసుపు మిశ్రమం శరీరానికి విశ్రాంతినిచ్చి మానసిక ప్రశాంతతను అందిస్తుంది.

పడుకునే ముందు చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల కూడా మంచిగా నిద్ర వస్తుంది. చల్లటి నీరు శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది. అంతే కాకుండా ఇది కండరాలను సడలించి శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. మీరు వేగంగా నిద్రపోవడానికి , నిద్రను మెరుగుపరచడానికి కూడా బాగా సహాయపడుతుంది.

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×