BigTV English

Tirupati: ఫీజు విషయంలో ఘర్షణ.. కాలేజీ ఏఓపై కత్తితో విద్యార్థి దాడి

Tirupati: ఫీజు విషయంలో ఘర్షణ.. కాలేజీ ఏఓపై కత్తితో విద్యార్థి దాడి

Inter Student Murder Attempt On College AO: తిరుపతి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తిరుచానూరులో ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఫీజు వివాదం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థి ఆ కళాశాల ఏఓపై కత్తితో దాడి చేశాడు. దీంతో కళాశాలలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో కళాశాలలో భయంకర వాతావరణం నెలకొంది.


వివరాల ప్రకారం.. తిరుపతిలోని తిరుచానూరులో ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆ విద్యార్థి ఫీజు బకాయి ఉండడంతో హాస్టల్‌కు పంపించకుండా ఆ కళాశాల ఏఓ క్యాంపస్‌లోనే ఉంచినట్లు ఆరోపించారు. అయితే ఈ విషయంలో ఇద్దరికి గొడవ జరిగిందని సమాచారం.

సంక్రాంతికి బకాయి ఫీజులను చెల్లిస్తామని చెప్పినప్పటికీ ఏఓ వినలేదని ఆ విద్యార్థి కుటుంబ సభ్యులు తెలిపారు. మొత్తం చెల్లిస్తామని హామీ ఇచ్చినా వినకుండా అనవసరంగా బ ూతులు తిట్టినట్లు ఆరోపించారు. అయితే కాలేజీ యాజమాన్యం మాత్రం విద్యార్థి మానసిక స్థితి బాలేదని ప్రచారం చేస్తున్నారు. గతంలోనూ నాలుగు సార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆరోపిస్తున్నారు.


అంతకుముందు విద్యార్థికి, ఏఓకు మధ్య గొడవ జరిగింది. దీంతో కళాశాలలో ప్రిన్సిపల్ దగ్గర ఏఓ మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా ఆ విద్యార్థి కత్తితో పొడిచినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో ఏఓ వెంకటరమణకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆయనను రుయా ఆస్పత్రికి తరలించారు.

Also Read:  పవన్ కళ్యాణ్ అలా వెళ్లారు.. ఇలా ఒక ప్రాణం పోయింది.. ఈ మరణాలను ఆపాలని లేదా.. బొత్స సూటి ప్రశ్న

ఈ ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం ప్రిన్సిపల్ తో మాట్లాడారు. ప్రస్తుతం ఆ మైనర్ విద్యార్థి పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×