BigTV English

IPS Mahesh Chandra Laddha: ఏపీకి ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్డా రాక.. వైసీపీ ఆగడాలకు చెక్ తప్పదా..?

IPS Mahesh Chandra Laddha: ఏపీకి ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్డా రాక.. వైసీపీ ఆగడాలకు చెక్ తప్పదా..?

IPS Mahesh Chandra Laddha Return to Andhra Pradesh: ఏపీ సర్వీస్‌లోకి సీనియర్ ఐపీఎస్ మహేష్ చంద్ర లడ్డా రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన సీఆర్పీఎఫ్ ఐజీగా ఉన్నారు. 1998 ఏపీ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారాయన. ఐపీఎస్ లడ్డాను రాష్ట్ర సర్వీస్‌లోకి పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండురోజుల కిందట కేంద్రానికి లేఖ రాశారు. వెంటనే ఆయనను ఏపీ సర్వీసులకు పంపుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.


ఐపీఎస్ మహేష్ చంద్ర లడ్డాను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు నియమిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. నిజాయితీ గల అధికారిగా లడ్డాకు మంచి పేరు ఉంది. లా అండ్ ఆర్డర్‌లో ఆయన కాంప్రమైజ్ కారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు అనే పేరు కూడా ఆయన సొంతం. లడ్డా సేవలు  వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.

2019లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన కోడి కత్తి ఘటన జరిగింది. ఆ సమయం లో విశాఖ సిటీ పోలీసు కమిషనర్‌గా ఉన్నారు. ఆ తర్వాత విశాఖ నుంచి నేరుగా సెంట్రల్ సర్వీసులకు వెళ్లారు. ఇప్పుడు ఆయనను కేంద్రం నుంచి ఏపీకి తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు.


Also Read:  పిన్నెల్లి అరెస్ట్‌పై ఈసీ ప్రకటన, విఘాతం కలిగిస్తే శిక్ష తప్పదు..

రాజస్థాన్‌కు చెందిన మహేష్‌చంద్ర లడ్డా ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఆ తర్వాత 1998 ఏపీ బ్యాచ్‌కు చెందిన ఆయన, విశాఖలో ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ప్రకాశం, గుంటూరు, నిజామాబాద్ జిల్లాలకు ఎస్పీగా పని చేశారు.  ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఐపీఎస్ మహేష్ చంద్ర లడ్డాపై నక్సల్స్ దాడి జరిగింది. ఆ ఘటనలో తృటిలో తప్పించుకున్నారు.

గుంటూరు ఎస్పీగా ఉన్న సమయంలో రౌడీయిజంపై ఉక్కుపాదం మోపడమేకాదు, క్లబ్‌లపై దాడులు చేశారు. ఆ తర్వాత విజయవాడ డిప్యూటీ కమిషనర్‌గా పని చేసిన అనుభవం ఆయన సొంతం. ఇప్పుడు సీఎం చంద్రబాబు ఆయనను ఏరి కోరి తీసుకొస్తున్నారు. ఆయనకు కీలక పదవి అప్పగించే అవకాశమున్నట్లు సమాచారం.

Tags

Related News

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Big Stories

×