BigTV English

Dinesh Karthik IPL Retirement: క్రికెట్ కి గుడ్ బై చెప్పిన పోరాట యోధుడు.. దినేష్ కార్తీక్

Dinesh Karthik IPL Retirement: క్రికెట్ కి గుడ్ బై చెప్పిన పోరాట యోధుడు.. దినేష్ కార్తీక్

Dinesh Karthik Retirement From IPL(Sports news today):

క్రికెట్ , కెరీర్ ఈ రెండింటితో అను నిత్యం పోరాడుతూనే ఉన్న ఏకైక క్రికెటర్ ఎవరంటే దినేశ్ కార్తీక్ అనే అంటారు. ఎన్నాళ్లు, ఎన్నాళ్లు అలా ఆడుతూనే ఉన్నాడు. నిరూపించుకుంటూనే ఉన్నాడు. జాతీయ జట్టులోకి వెళుతూనే ఉన్నాడు, బయటకు వస్తూనే ఉన్నాడు. మళ్లీ పోరాటం, మళ్లీ పోరాటం, అలా 2004 నుంచి నేటి వరకు 20 ఏళ్లు నిరంతరం కొత్త శక్తితో, కొత్త ఉత్సాహంతో నిరూపించుకుంటూనే ఉన్నాడు. అలాంటి దినేశ్ కార్తీక్ క్రికెట్ కి గుడ్ బై చెప్పేశాడు. యువతరానికి స్ఫూర్తిగా నిలిచే దినేష్ కెరీర్ లో వెనక్కి తిరిగి చూస్తే ఎన్నో అంశాలు కనిపిస్తాయి.


టీమ్ ఇండియాలో, ఐపీఎల్ లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటిన 38 ఏళ్ల వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ క్రిష్ణకుమార్ దినేశ్ కార్తీక్ తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడు. చెన్నై జన్మస్థలం.

ఐపీఎల్ లో బెంగళూరు, కోల్ కతా, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.
ప్రస్తుతం 2024 సీజన్ లో 15 మ్యాచ్ లు ఆడి 36.22 సగటుతో 326 పరుగులు చేశాడు.


నిజానికి మహేంద్ర సింగ్ ధోనీకి సమకాలీకుడు దినేశ్ కార్తీక్ అని చెప్పాలి. ధోనీ లాగే తను కూడా కీపర్ కమ్ బ్యాటర్. ఇద్దరూ నేషనల్ టీమ్ లో ఎంపికయ్యేందుకు అన్నిరకాలుగా అర్హత ఉన్న వ్యక్తులే. కానీ మహేంద్ర సింగ్ ధోనీ కారణంగా తన కెరీర్ మసకబారిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే ఇద్దరూ అటూ ఇటుగా 2004లోనే జాతీయ జట్టులోకి వచ్చారు. ఇద్దరూ ఆల్ రౌండర్లే… కీపర్ కమ్ బ్యాటర్లే. అయితే  సెలక్టర్లు ధోనీకన్నా ముందుగా దినేష్ కార్తీక్ కి ఓటు వేశారు. కానీ వచ్చిన అవకాశాలను దినేష్ కార్తీక్ అందిపుచ్చుకోలేదు.

Also Read: ఆర్సీబీ ఓటమికి ఏడు కారణాలు..

అదే సమయంలో సీరియల్ నెంబర్ 2 లో ఉన్న ధోనీ అవకాశాలను ఒడిసిపట్టుకున్నాడు. ప్రారంభంలోనే పాకిస్తాన్ మీద విశాఖపట్నంలో 148 పరుగులు చేయడంతో ధోనీ పేరు దేశంలో మోత మోగిపోయింది. అంతే జాతీయజట్టులో తను పాతుకుపోయాడు. తర్వాత కెప్టెన్ అయ్యాడు. భారత క్రికెట్ లో విడదీయరాని బంధమయ్యాడు. అలాంటి సమయంలో ధోనీ తుఫాను గాలిలో కొట్టుకుపోయినవాడు దినేష్ కార్తీక్ అని చెప్పాలి. కనీసం తను బ్యాటర్ గానో, బౌలర్ గానో ఉండి ఉంటే, పరిస్థితి వేరుగా ఉండేది. తను కీపర్ కమ్ బ్యాటర్ కావడంతో ధోనీని దాటి జట్టులోకి రాలేకపోయాడు.  అయినా సరే, పట్టుదలతో తన ప్రతిభతో దినేశ్ కార్తీక్ జాతీయ జట్టులో ఆడాడు.

అలా 26 టెస్ట్ మ్యాచ్ లు ఆడి 1025 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 7 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి.  57 క్యాచ్ లు పట్టాడు. 6 స్టంపింగ్ లు చేశాడు.
94 వన్డేలు ఆడి 1752 పరుగులు చేశాడు. 9 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి.
64 క్యాచ్ లు పట్టాడు. 7 స్టంపింగ్ లు ఉన్నాయి.
56 టీ 20 లు ఆడాడు. 672 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఆఫ్ సెంచరీ ఉంది. 26 క్యాచ్ లు పట్టాడు. 8 స్టంపింగులు ఉన్నాయి.

ఐపీఎల్ లో మాత్రం దినేష్ కార్తీక్ కి మంచి రికార్డు ఉంది. 257 మ్యాచ్ లు ఆడాడు. 4842 పరుగులు చేశాడు. ఇందులో 22 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. 97 నాటౌట్ హయ్యస్ట్ స్కోరు ఉంది. ఏనాడు క్రికెట్ లో తను వ్యక్తిగత రికార్డుల కోసం ఆడలేదు. జట్టు గెలుపు కోసమే ఆడాడని అందరూ అంటారు. ఒక మంచి క్రికెటర్ గా, ఒక మంచి మనసున్న క్రికెటర్ గా, ఒక మంచి స్నేహితుడిగా, వివాదరహితునిగా పేరు పొందిన దినేష్ కార్తీక్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా సక్సెస్ ఫుల్ గా కొనసాగాలని మనం ఆశిద్దాం.

Tags

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×