Anchor Suma: టాలీవుడ్ ప్రముఖ యాంకర్ సుమ కనకాల(Suma Kanakala), నటుడు రాజీవ్ కనకాల (Rajeev Kanakal)వారసుడిగా రోషన్ (Roshan) ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టారు. ఇదివరకే రోషన్ బబుల్ గమ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది. ఇక తాజాగా ఈయన మోగ్లీ (Mowgli)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో తాజాగా సినిమా నుంచి గ్లింప్ విడుదల చేశారు. ఇక ఈ వీడియో లాంచ్ అనంతరం చిత్ర బృందం కాలేజీ స్టూడెంట్స్ తో సరదాగా మాట్లాడుతూ ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కోతి పనులు చేసేవాడిని..
ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ రోషన్ ను ప్రశ్నిస్తూ.. మీ చిన్నప్పటి నిక్ నేమ్ గురించి మీ అమ్మగారు ఓ విషయాన్ని తెలిపారు అంటూ మాట్లాడటంతో వెంటనే రోషన్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు నేను చాలా కోతి పనులు చేసే వాడిని. ఇలా కోతి పనులు చేయటం వల్ల మా నాన్న నాకు మోగ్లీ అని నిక్ నేమ్ పెట్టారు అనుకోకుండా నా సినిమాకు కూడా అదే టైటిల్ అయ్యింది అంటూ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ఈ సినిమా గురించి నాకు చెప్పడానికి సందీప్ వచ్చినప్పుడు ముందుగా టైటిల్ గురించి చెప్పలేదు. స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత ఈ సినిమాకు మోగ్లీ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నాము అంటూ చెప్పడంతో నేను షాక్ అయ్యానని రోషన్ తెలిపారు.
ముద్దు పేరు కూడా మోగ్లీ..
ఇలా రోషన్ చిన్నప్పటి ముద్దు పేరు కూడా మోగ్లీ కావటంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా అంత కరెక్ట్ గా సినిమా కూడా అదే పేరు ఎలా సింక్ అయింది బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రోషన్ ఫేవరెట్ టాలీవుడ్ హీరో హీరోయిన్ల గురించి కూడా ప్రశ్న ఎదురు కావడంతో చాలా తెలివిగా సమాధానం చెప్పారు. నాకు శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టమని చెప్పిన రోషన్ ఈతరం హీరోయిన్లు ఎవరు ఇష్టమని అడగటంతో అందరూ ఇష్టమేనని చెప్పారు. ఇక హీరోల విషయంలో కూడా ఈయన ఏ ఒక్కరి పేరు చెప్పకుండా తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోలు ఇష్టమేనని ప్రతి ఒక్కరి నుంచి ఎన్నో విషయాలను తాను స్పూర్తిగా తీసుకుంటాను అంటూ చాలా తెలివిగా సమాధానం చెప్పారు.
సినిమాలంటే ఆసక్తి…
టాలీవుడ్ ఇండస్ట్రీలో తన ఫేవరెట్ హీరో ఎవరు అనే ప్రశ్నకు ఒక్కరి గురించే సమాధానం చెబితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకున్న రోషన్ చాలా తెలివిగా తనకు అందరూ ఇష్టమేనని సమాధానం ఇవ్వడంతో సుమా కొడుకు అనిపించుకున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమాలంటే ఎంతో ఆసక్తి ఉన్న రోషన్ అతి చిన్న వయసులోనే హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన మొదటి సినిమా బబుల్ గమ్ కాస్త నిరాశపరిచిన మోగ్లీ సినిమా ద్వారా హిట్ కొట్టాలనే కసి రోషన్ లో కనిపిస్తుంది. మరి ఈ సినిమా ద్వారా ఎలాంటి హిట్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.
Also Read: Gild Producers: రేపు మరోసారి బేటి కానున్న గిల్డ్ ప్రొడ్యూసర్స్.. మేనేజర్స్… సమ్మెపై మళ్ళీ చర్చలు!