Iran-Israel War: ఇరాన్ – ఇజ్రాయెల్ దేశాలు పరస్పరం భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ దేశం ఇరాన్‌లోని ప్రధాన నగరాలపై అటాక్ చేస్తోంది. అటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌లోని ప్రధాన నగరమైన జెరూసలెంపై దాడులకు దిగుతోంది. అయితే రెండు దేశాల మధ్య యుద్ద నేపథ్యంలో అక్కడున్న భారతీయుల భద్రతపై ఆందోళన నెలకొంది. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్‌లో ఉన్న తెలుగు వాళ్లు టెన్షన్‌కు గురవుతున్నారు. ఇజ్రాయెల్‌లో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువ ఉండడంతో.. ఇక్కడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అటు ఇజ్రాయెల్ కూడా భారతీయ పౌరులకు పలు కీలక సూచనలు ఇస్తోంది. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొదని చెబుతోంది. ఈ క్రమంలోనే బిగ్ టీవీ అక్కడున్న తెలుగు ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం జెరూసలెంలో ఉన్న తెలుగు ప్రజలు ఎలా ఉన్నారు? వారు సేఫేనా బిగ్ టీవీ క్లియర్ కట్‌గా తెలుసుకునే ప్రయత్నం చేసింది.
జెరూసలెంలో రెండేళ్ల నుంచి నివసిస్తున్న ఓ తూర్పు గోదావరి యువకుడు అక్కడి పరిస్థితి గురించి వివరించారు. ‘మేం ఇక్కడ క్షేమంగా ఉన్నాం. ఇరాన్ దేశం జెరూసలెం నగరంపై బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఇచ్చే సలహాలను మేం పాటిస్తున్నాం. యుద్దం జరిగే 30 నిమిషాల ముందు ప్రభుత్వం సైరన్ మోగిస్తోంది. అప్పుడు మేం వెంటనే సేఫ్టీ రూంలోకి వెళ్తాం. మళ్లీ గవర్నమెంట్ ఇచ్చే సైరన్‌తో బయటకు వస్తున్నాం. ఇరాన్ రాకెట్లను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ అవలీలగా నాశనం చేస్తోంది. ఆ తర్వాత మేం సేఫ్టీ రూం లేదా అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వస్తున్నాం’ అని అతను చెప్పాడు.
READ ALSO: ఇరాన్‌కు మద్ధతు ఇచ్చే దేశాలేవీ? భారత్ మద్దతు ఎవరికీ?
‘ఇరాన్ ప్రధానంగా టెల్ అవీవ్, నార్త్ ఇజ్రాయెల్, జెరూసలెం నగరాలపై ఎక్కువగా అటాక్ చేస్తోంది. ఇజ్రాయెల్ దేశాన్ని అంతటిని ఇరాన్ టార్గెట్ చేసింది. రాత్రి కాగానే రాకెట్ల వర్షం కురిపిస్తుంది. ఇజ్రాయెల్ లో ఉన్న భారతీయులు చాలా క్షేమంగా ఉన్నారు. ఇక్కడ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తోంది. ముఖ్యంగా గవర్నమెంట్ భారతీయులను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇజ్రాయెల్ లో ఎక్కువగా ఇండియన్ స్టూడెంట్సే ఉన్నారు. పదివేల మందికి పైగా ఇండియన్స్ ఇక్కడ ఉన్నారు. కేర్ టేకర్స్ ప్రతినిత్యం మన దేశ పౌరుల గురించి సలహాలు ఇస్తున్నారు. క్షేమంగా చూసుకుంటున్నారు’ అని అతను వివరించాడు.
READ ALSO: Rain Alert: రాష్ట్రానికి బిగ్ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షం
‘ఇజ్రాయెల్ కు వచ్చినప్పుడు కేర్ టేకర్ గా మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఇక్కడ వీదేశీయులకు మంచి గౌరవం ఇస్తారు. ముఖ్యంగా ఇండియన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. జూన్ 30 వరకు ఇజ్రాయెల్ రెడ్ అలర్ట్ విధించారు. అప్పటి వరకు ఎవరూ ఇంట్లో నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి సమయంలో ఇరాన్ అటాక్ చేస్తోంది. దీంతో వెంటనే ఇజ్రాయెల్ గవర్నమెంట్ సైరన్ నోటిఫికేషన్ ఇస్తోంది. ఇజ్రాయెల్ రూల్స్‌ను అతిక్రమించడం లేదు. కానీ ఇరాన్ మాత్రం ఇక్కడి యూదులపై అటాక్ చేస్తోంది. మనకు ఏ ఆపాయం కలిగినా పది నుంచి పదిహేను నిమిషాల్లో పోలీసులు మన దగ్గరకు వస్తారు. ఇప్పటివరకు అయితే భారతీయ పౌరులు క్షేమంగా ఉన్నారు’ అని ఆయన పేర్కొన్నాడు.