Big TV exclusive: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మరో కొత్త సినిమాకు కమిట్ అయ్యారు. ప్రస్తుతం ఈయన హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagath Singh) సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కమిట్ అయిన హరిహర వీరమల్లు, ఓజీ సినిమా షూటింగు పనులు పూర్తి కావడంతో ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు ఈ నెలలోపు ఈ షూటింగ్ కూడా పూర్తి అవుతుందని తెలుస్తుంది ఇలా ఈ షూటింగ్ పూర్తి కాగానే పవన్ కళ్యాణ్ కు ఎలాంటి కొత్త సినిమాలు కూడా లేవు.రాజకీయాల పరంగా పవన్ కళ్యాణ్ ఎంతో బిజీగా గడుపుతున్నారు ప్రస్తుతం డిప్యూటీ సీఎం గాను మంత్రిగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు కమిట్ అవ్వరని అందరూ భావించారు.
బ్రో డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్…
ఇలా రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇదివరకు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి పూర్తి స్థాయిలో రాజకీయాలకే పరిమితం అవుతారని భావించారు కానీ ఈయన మాత్రం అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తాజాగా మరో కొత్త సినిమాకు కమిట్ అయినట్లు ఇండస్ట్రీలో ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. పవన్ కళ్యాణ్ ఇదివరకు నటించిన బ్రో సినిమా దర్శకుడు సముద్రఖని (Samuthirakani)దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. గత కొద్ది రోజుల క్రితం సముద్రఖని పవన్ కళ్యాణ్ ను పర్సనల్ గా కలిసినట్టు వార్తలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
మైత్రి మూవీ నిర్మాణంలో…
ఇలా పవన్ కళ్యాణ్ కోసం ఈయన ప్రత్యేకమైన ఒక కథను సిద్ధం చేసి పవన్ కళ్యాణ్ కు వినిపించారని, ఈ కథ పవన్ కళ్యాణ్ కు బీభత్సంగా నచ్చడంతో వెంటనే ఈ సినిమాకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ పనులు ఈ ఏడాది నవంబర్ నుంచి మొదలు కాబోతున్నాయని తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ సముద్రఖని కాంబినేషన్లో రాబోయే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలను త్వరలోనే అధికారకంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది.
ఆనందానికి అవధులు లేవుగా..
పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా ఒకవైపు రాజకీయ వ్యవహారాలను చూసుకుంటూనే మరోవైపు సినిమాలలో నటిస్తూ ఉండేవారు. అయితే గత ఎన్నికలలో ఈయన అద్భుతమైన మెజారిటీ సాధించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్నారు దీంతో ఇకపై పవన్ కళ్యాణ్ ను తాము వెండి తెరపై నటుడిగా చూడలేమని అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేశారు కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం ముందుగా కమిట్ అయిన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూనే, మరోవైపు కొత్త సినిమాలకు కూడా కమిట్ అవుతూ అభిమానులను సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Also Read: Jabardasth Anchor: సుధీర్ కాదు భయ్యా మానస్… జబర్దస్త్ దుకాణం సర్దేయాల్సిందే?