BigTV English

ISRO : మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. రేపే నింగిలోకి..

ISRO : మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. రేపే నింగిలోకి..

ISRO : చంద్రయాన్‌ 3, ఆదిత్య ఎల్1 ప్రయోగాలు సక్సెస్‌ కావడంతో జోష్‌లో ఉన్న ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతోంది. జాబిల్లిపై వ్యోమగామిని పంపేందుకు గగన్‌యాన్‌ పేరుతో మరో ప్రయోగానికి రెడీ అవుతోంది. ఈ మేరకు అక్టోబర్ 21, శనివారం నెల్లూరు జిల్లా శ్రీహరి కోట నుంచి ఉదయం టీవీ-డీ1 రాకెట్‌ను నింగిలోకి పంపనున్నారు శ్రాస్తవేత్తలు. వ్యోమగాముల గదిని రాకెట్‌కి అమర్చి భూమికి 17 కిలోమీటర్ల దూరంలో అంతరిక్షంలోకి టీవీ-డీ1ని పంపనున్నారు.


రాకెట్‌ నింగిలోకి వెళ్లాక అక్కడ నుంచి పారాచూట్ల సాయంతో బంగాళాఖాతంలో క్యూ మాడ్యూల్‌ని దింపనున్నారు. నేవి సిబ్బంది సహాయంతో క్యూ మాడ్యూల్‌ సిస్టంని అక్కడ నుంచి సురక్షితంగా తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములను అత్యవసర సమయంలో సురక్షితంగా కిందకి దించే ప్రక్రియను ఇస్రో ప్రయోగాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ ప్రయోగం మొత్తం 531.8 సెకన్లపాటు జరగనుంది. ప్రయోగానికి వినియోగించే రాకెట్‌ 44 టన్నుల బరువుతో ఉండనుంది. 2025నాటికి వ్యోమగాములతో గగన్‌యాన్‌ అంతరిక్షంలోకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలోనే టీవీ-డీ1 రాకెట్‌ ప్రయోగానికి సిద్ధమైంది ఇస్రో. ఇక త్వరలో రోబోతో కక్ష్యలోకి రెండో ప్రయోగం చేపట్టనుంది ఇస్రో. టీవీ-డీ1 రాకెట్‌ ప్రయోగం నేపథ్యంలో షార్‌ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు.


Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×