BigTV English

Hamas-Drug : హమాస్ దాడి.. ఆ డ్రగ్‌తోనే రెచ్చిపోయారా?

Hamas-Drug : హమాస్ దాడి.. ఆ డ్రగ్‌తోనే రెచ్చిపోయారా?
Hamas-Drug

Hamas-Drug : ఆకలి, నిద్ర దూరమైనా శరీరాన్ని దీర్ఘకాలం ఉత్తేజంగా ఉంచే ఓ డ్రగ్‌ను హమాస్ మిలిటెంట్లు వినియోగించినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు వారాల క్రితం ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి జరిపిన సందర్భంగా కేప్టగాన్ అనే మాత్రలను వారు వాడినట్టు తెలుస్తోంది. ఈ స్టిమ్యులెంట్ డ్రగ్‌కు పేదవాడి కొకైన్‌గా పేరుంది.


ఇది సింథటిక్ యాంఫటీన్ రకానికి చెందిన స్టిమ్యులెంట్. దక్షిణ ఐరోపాలో దొంగచాటుగా తయారు చేస్తారు. అక్రమ మార్గాల్లో టర్కీ మీదుగా అరేబియా ద్వీపకల్పంలోని మార్కెట్లకు చేరుతుంది. అక్టోబర్ 7 నాటి దాడిలో ఇజ్రాయెల్‌ గడ్డపై మరణించిన హమాస్ మిలిటెంట్ల ద్వారా కేప్టగాన్ పిల్స్ బయటపడ్డాయి. ఈ డ్రగ్‌ను ఉగ్రవాదులు ఎక్కువగా వినియోగిస్తారు.

ఘోరమైన పనులకు పాల్పడే ముందు ఆ పిల్స్‌ను తీసుకుంటారు. ఫలితంగా ఎలాంటి అలజడి, ఆందోళన వారిలో కలగవు. ఎంతటి క్రూరనేరమైనా ప్రశాంత చిత్తంతో పూర్తి చేయగలుగుతారు. ఆకలిదప్పులు లేకుండా దీర్ఘకాలం ఉంచుతుందా డ్రగ్. అంతే కాదు నిద్రను కూడా దూరం చేస్తుంది.


ఈ కారణంగానే ఆపరేషన్లు చేపట్టే ముందు ఐసిస్ ఉగ్రవాదులు వీటిని వాడేవారు. తొలిసారిగా ఈ విషయం 2015లో తెలిసింది. ఐసిస్ లాంటి ఉగ్ర సంస్థలు ప్రాభవం కోల్పోవడంతో లెబనాన్, సిరియాలోని ఉగ్ర ముఠాలు కేప్టగాన్ పిల్స్ తయారీని తమ చేతుల్లోకి తీసుకున్నాయి. వాటిని పెద్దఎత్తున ఉత్పత్తి చేస్తూ వివిధ దేశాలకు అక్రమంగా సరఫరా చేస్తున్నాయి.

గాజా మార్కెట్‌లో ఈ డ్రగ్ విచ్చలవిడిగా దొరుకుతుంది. పేద దేశాల్లో ఒకటి లేదా రెండు డాలర్లు వెచ్చిస్తే కేప్టగాన్ పిల్స్ లభ్యమవుతాయి. సంపన్నదేశాల్లో మాత్రం ఒక్కో మాత్ర 20 డాలర్ల వరకు ధర పలుకుతుంది. హెజ్బుల్లా అండదండలున్న సిరియాకు కేప్టగాన్ డ్రగ్ స్మగ్లింగ్ పెద్ద ఆదాయ వనరుగా మారింది. 2020లో సిరియా నుంచి ఎగుమతి డ్రగ్ విలువ హీనపక్షంలో 3.5 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. చట్టబద్ధంగా ఆ దేశం చేసే ఎగుమతుల విలువకు ఇది దాదాపు ఐదు రెట్లు.

కేప్టగాన్ స్మగ్లింగ్ దేశదేశాలకు విస్తరించింది. సౌదీ అరేబియా, ఇటలీ, గ్రీస్, మలేసియా, ఈజిప్టు దేశాల్లో గతంలో పలు మార్లు ఈ డ్రగ్‌ను అధికారులు పట్టుకున్నారు. జోర్డాన్‌లో చౌకగానే పిల్స్ లభ్యమవుతాయి. నిరుడు 250 మిలియన్ల కేప్టగాన్ పిల్స్ స్మగ్లింగ్‌ను విజయవంతంగా అడ్డుకున్నారు. గత నాలుగేళ్లలో కేప్టగాన్ డ్రగ్ స్మగ్లింగ్ 18 రెట్లు పెరిగిందని అంచనా.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×