BigTV English

Jagan and Vijayamma: వైఎస్ఆర్‌కు జగన్, విజయమ్మ నివాళి, మిస్ యూ డాడ్ అంటూ..

Jagan and Vijayamma: వైఎస్ఆర్‌కు జగన్, విజయమ్మ నివాళి, మిస్ యూ డాడ్ అంటూ..

Jagan and Vijayamma: మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 15వ వర్థంతి నేడు.  ఈ సందర్భంగా పులివెందులలోని ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాటు వద్ద నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులు.


సోమవారం ఉదయం 9 గంటల సమయంలో వైఎస్ఆర్ వైఫ్ విజయమ్మ, తనయుడు, మాజీ సీఎం జగన్, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు ఘాట్ వద్దకు వచ్చి నివాళులు అర్పించారు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని మహానేతను స్మరించుకున్నారు.

రాయలసీమకు చెందిన వైఎస్ఆర్ బంధువులు, వైసీపీ ముఖ్యనేతలు హాజరయ్యారు. అలాగే కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పాలనను గుర్తు చేసుకున్నారు.


ALSO READ: విజయవాడ వరదలు మూడు లక్షల మందిపై ప్రభావం..

ఘాట్ వద్ద జగన్.. తన తండ్రికి నివాళులు అర్పిస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మిస్ యు డాడ్ అంటూ చిన్న క్యాప్షన్ ఇచ్చేశారు. అనంతరం పులివెందులలో తన నివాసం వద్ద ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం పులివెందుల నుంచి రోడ్ మార్గంలో తాడేపల్లికి చేరుకోనున్నారు మాజీ సీఎం జగన్. మంగళవారం ఆయన విదేశాలకు వెళ్లనున్నారు.

మరోవైపు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూడా  ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచే నేతగా వైఎస్సార్ లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిదన్నారు. భౌతికంగా వైఎస్ఆర్ మన మధ్య లేకపోయినా,  ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే ఉన్నారని, నాన్న ఆశయాలే తనను చేయి పట్టి నడిపిస్తున్నాయని వెల్లడించారామె.

 

Related News

AP Rain Alert: బిగ్ అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షసూచన.. ఆ జిల్లాలలో ఎఫెక్ట్ ఎక్కువే!

AP new bar policy: ఏపీలో కొత్త బార్ పాలసీ.. ఇకపై మందుబాబులకు అక్కడ కూడా కిక్కే!

AP Cabinet: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ కేబినెట్.. ఒకటి కాదు సుమా.. అవేమిటంటే?

Sunil Kumar Ahuja: ఏపీ లిక్కర్ కేసులో కొత్త కోణం.. సునీల్ అహూజాపై సిట్ కన్ను, ఇంతకీ వీళ్లెవరు?

AP Liquor Case: లిక్కర్ కేసు.. విమానంలో నేతలు-బ్యూటీలు, జల్సాల గుట్టు బయట పెట్టిన ఆనం

Pulivendula Tensions: బైపోల్ వేళ పులివెందులలో టెన్షన్.. టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య దాడులు

Big Stories

×