BigTV English
Advertisement

Shruti Haasan: కూలీ మూవీ కోసం కర్రతిప్పుతున్న శృతిహాసన్.. వీడియో వైరల్

Shruti Haasan: కూలీ మూవీ కోసం కర్రతిప్పుతున్న శృతిహాసన్.. వీడియో వైరల్

Shruti Haasan Learns Stick Fight in Rajanikanth movie Coolie video viral: ఒక నటుడిగా ఎవరూ చేయలేని..చేయబోని ప్రయోగాలు చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందిన లోక నాయకుడు కమల్ హాసన్. ఈ విషయంలో కమల్ ని ఎవరూ ఇంతవరకూ బీట్ చెయ్యలేదు. దశావతారం మూవీలో ఏకంగా పది గెటప్పులతో కనిపించి అందరూ నోరు వెళ్లబెట్టేలా చేశాడు. అలాంటి కమల్ హాసన్ నటనా వారసత్వాన్ని పుణుకిపుచ్చుకుంది శృతి హాసన్. తెలుగు, తమిళ, హిందీ మూవీస్ లో చేసి తన మల్టీ ట్యాలెంట్ ప్రదర్శించింది. స్టార్ హీరోయిన్ గా తెలుగులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ, బాలకృష్ణ, చిరంజీవి సరసన నటించి తనకంటూ ఓ క్రేజ్ క్రియేట్ చేసుకుంది. దాదాపు 24 సంవత్సరాల క్రితం కమల్ హాసన్ దర్శకత్వంలో వచ్చిన హేరామ్ మూవీలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. అయితే టాలీవుడ్ లో ఓ ఫ్లాప్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది.


తొలి సినిమాయే ఫ్లాప్

2011లో అనగనగా ఓ ధీరుడు అనే మూవీని హీరో సిద్ధార్థ్ తో కలిసి చేసింది. మంచు లక్ష్మి ఆ మూవీలో విలన్ గా నటించింది. గ్రాఫిక్స్ టెక్నాలజీ సహకారంతో ఎంతో భారీ వ్యయంతో నిర్మించిన ఆ మూవీ ఫ్లాప్ కావడంతో శృతి హాసన్ తర్వాత నటించిన ఓ మై ఫ్రెండ్ మూవీ కూడా నిరాశపరిచింది. దీనితో కొంతకాలం పాటు శృతి హాసన్ ఐరన్ లెగ్ అని పేరు పడింది. తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. తర్వాత కొంతకాలం కెరీర్ బాగానే సాగించింది. గత ఏడాది సంక్రాంతికి ఒక రోజు తేడాతో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు రీలీజయ్యాయి. వాల్తేరు వీరయ్యగా చిరంజీవి, వీర సింహారెడ్డి గా బాలకృష్ణ నటించిన రెండు సినిమాలూ కమర్షియల్ గా హిట్ స్టేటస్ అందుకున్నాయి. విశేషం ఏమిటంటే ఈ రెండు సినిమాలలోనూ హీరోయిన్ గా శృతి హాసన్ నటించింది. రీసెంట్ గా సలార్ మూవీలోనూ నటించింది. అయితే అవకాశాల జోరు మాత్రం తగ్గిదనే చెప్పాలి.


కూలీ కోసం కర్రసాము

ప్రస్తుతం శృతి హాసన్ రజనీకాంత్ మూవీ కూలీలో నటిస్తోంది. ప్రమఖ హిట్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే కూలీ మూవీలో శృతి హాసన్ ఓ ముఖ్యమైన క్యారెక్టర్ చేయబోతోంది. ఆమె పాత్ర గురించి బయటకు విషయాలేమీ రాలేదు. కానీ యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రగా తెలుస్తోంది. శృతి హాసన్ గతంలో రవితేజ నటించిన క్రాక్ మూవీలో మార్షల్ ఆర్ట్స్ చేసి చూపించింది. ఆ సన్నివేశం అప్పట్లో మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే కూలీ మూవీలో శృతిహాసన్ ఓ కర్రఫైట్ కోసం కుస్తీ పడుతోంది. ఇందుకు సంబంధించి ఓ ట్రైనర్ వద్ద కర్రసాము నేర్చుకుంటోంది. కమల్ హాసన్ గతంలో కర్రసాము కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నారు. ఆయన నటించిన దేవర్ మగన్ అనే సినిమాకు అప్పట్లో ఆయన చేసిన కర్రఫైట్ ప్రత్యేక ఆకర్షణగా తయారయింది.

నాడు కమల్ హాసన్ నేడు శృతి హాసన్

దేవర మగన్ చిత్రం తెలుగులో క్షత్రియ పుత్రుడుగా రిలీజయింది. ఇప్పుడు తండ్రి మాదిరిగా శృతి హాసన్ తన పాత్ర కోసం సహజత్వంగా ఉండేందుకు తానే స్వయంగా కర్రసాములో శిక్షణ పొందుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందరూ శృతి హాసన్ ను అభినందిస్తున్నారు. పాత్ర కోసం తన తండ్రిలాగానే అంకిత భావంతో చేస్తున్న శృతి హాసన్ ను ఇప్పుడు సోషల్ మీడియాలో ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×