BigTV English

Jagan clarification: ఒప్పేసుకున్న జగన్.. మళ్లీ బెంగుళూరుకి, పోతే పోనీ అంటూ

Jagan clarification: ఒప్పేసుకున్న జగన్.. మళ్లీ బెంగుళూరుకి, పోతే పోనీ అంటూ

Jagan clarification: వైసీపీ అధినేత జగన్‌కు తత్వం బోధపడిందా? నేతల వెళ్లిపోవడంపై చేతులు ఎత్తేశారా? విపక్షంలో ఉంటే ఇలాంటివి తప్పవని ముందుగానే భావించారా? పార్టీని విడిచి నేతలు వెళ్లిపోతున్నారా వేదాంత ధోరణిలో జగన్ మాటలు దేనికి అర్థం? ఇంతకీ వాళ్లని జగన్ పంపిస్తున్నారా? లేక వాళ్లే వెళ్తున్నారా? అనే డౌట్ నేతలతోపాటు కార్యకర్తలను వెంటాడుతోంది.


తిరుమల లడ్డూ వివాదంపై తన వంతు క్లారిటీ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. లడ్డూ వ్యవహారంపై శుక్రవారం తాడేపల్లిలో ప్రెస్‌‌మీట్ పెట్టిన ఆ విషయాన్ని లైట్‌గా తీసుకున్నారు. తనలాగే టీటీడీ బోర్డులోని ఉన్నవారంతా నీతిమంతులంటూ సర్టిఫికెట్ ఇచ్చేశారాయన.  రిపోర్టులు బయటకు వచ్చినా ఇదంతా చంద్రబాబు సర్కార్ చేసిందంటూ చెప్పే ప్రయత్నం చేశారు.

అంతేకాదు ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని ఆయన ఎక్కడా ప్రస్తావించ లేదు. సీజేఐ, పీఎం లేఖ రాస్తానంటూ ఆ విషయాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. తిరుమల వివాదం గురించి ప్రెస్‌మీట్ పెట్టి మిగతా అంశాల గురించి ప్రస్తావించారు. ఇదంతా చంద్రబాబు సర్కార్ ఆడుతున్న ఎత్తుగత అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు.


అనుకున్న విధంగానే టాపిక్‌ని డైవర్ట్ చేశారు మాజీ సీఎం. విచిత్రం ఏంటంటే.. నేషనల్ మీడియా, బీజేపీ నేతలను సైతం తప్పుబట్టారాయన. సీఎం చంద్రబాబును బీజేపీ నేతలు తిట్టాలంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

ALSO READ: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

పార్టీలోని నేతలను జగన్..  మిగతా పార్టీలకు పంపిస్తున్నారా? జగన్ ఆలోచన తీరు నచ్చక వెళ్లిపోతున్నారో తెలీదు. కానీ ఆ విషయాలపై వేదాంత ధోరణిలో మాట్లాడారు జగన్. బాలినేని పార్టీ నుండి వెళ్లి పోవడాన్ని తేలిగ్గా తీసుకున్నారు. నాయకుడు అనేవాడు ప్రజల నుంచి వస్తాడంటూ తనదైన శైలిలో చెప్పారు. నేతలు వెళ్లిపోతారని ముందుగానే గ్రహించినట్టు కనిపడుతోంది.

తిరుమల వ్యవహారం వైసీపీని భారీగానే డ్యామేజ్ చేసినట్టు ఆ పార్టీలోకి మెజార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఫ్యాన్ కింద ఉంటే రాజకీయ మునుగడ ఉండదని, వీలైనంత త్వరగా సర్దుకోవడం మంచిదనే అభిప్రాయానికి వస్తున్నారు నేతలు.

జాతీయస్థాయిలో వైసీపీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందని భావించారు ఆ పార్టీ నేతలు. ఇప్పటికే ఆ పార్టీలోని నేతలు చెట్టుకొకరు.. పుట్టకొకరుగా చెదిరిపోతున్నారు. మరికొందరు నేతలు వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారు. టీడీపీ, జనసేన, వైసీపీ నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేనాటికి వైసీపీ ఖాళీ కావడం ఖాయమనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

 

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×