E-Paper
Advertisement

కారు నిండా ముద్దులు.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్, పాపం ప్రియుడు!

కారు నిండా ముద్దులు.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్, పాపం ప్రియుడు!
Advertisement

Lipstick Kisses All Over Car: ప్రేమను కాస్త డిఫరెంట్ గా ఎక్స్ ప్రెస్ చేయాలనుకుంది ఓ యువతి. ప్రియుడికి ఎప్పటికీ గుర్తుండిపోయే సర్‌ ప్రైజ్ ఇవ్వాలనుకుంది. ఇందుకోసం ఓ క్రేజీ ప్లాన్ వేసింది. అతడి కారుపై ఏకంగా వేలాది లిప్‌ స్టిక్ ముద్దుల గుర్తులు పెట్టింది. కానీ, ఆ సరదా చివరికి ఆమె లవర్ కు ఊహించని షాక్ ఇచ్చేలా చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఘటనపై పోలీసులు స్పందించి.. సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందటే..

4 గంటల శ్రమ.. 3,400 ముద్దులు!

గ్వాలియర్‌లోని థాటీపూర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడి కారును అతడి ప్రియురాలు ప్రత్యేకంగా అలంకరించాలని నిర్ణయించుకుంది. సోషల్ మీడియాలో చూసిన ఓ ట్రెండ్ నుంచి ప్రేరణ పొందిన ఆమె, ఎరుపు రంగు లిప్‌ స్టిక్‌ తో కారు మొత్తం ముద్దుల గుర్తులు పెట్టింది. దీనికోసం ఆమె దాదాపు నాలుగు గంటల పాటు కష్టపడింది. కారు బోనెట్, డోర్లు, డిక్కీ సహా దాదాపు అన్ని భాగాలపై లిప్‌స్టిక్ ముద్దుల గుర్తులు పెట్టింది. మొత్తంగా కారుపై సుమారు 3,400 ముద్దులు పెట్టింది. దీంతో ఆ కారు సాధారణ వెహికల్ లా కాకుండా పూర్తిగా ఎరుపు రంగు లిప్‌స్టిక్ ముద్రలతో నిండిన ఒక విచిత్రమైన డిజైన్‌ లా కనిపించింది.

రోడ్డు మీదకు రాగానే ప్రజలను ఆకట్టుకున్న కారు   

Advertisement

ప్రియురాలి సర్‌ప్రైజ్ చూసిన యువకుడు ఆ కారును రోడ్డుపై నడిపాడు. అయితే కారుపై ఉన్న వేలాది ముద్దుల గుర్తులు చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. కొందరు ఆ కారును ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొద్దిసేపటికే ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. చాలామంది దీనిని ప్రేమకు సంబంధించిన వినూత్న ప్రయోగంగా భావించి ఆసక్తిగా చూశారు. కానీ, సోషల్ మీడియాలో వచ్చిన ఈ వైరల్ వీడియో చివరికి పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది.

రంగంలోకి ట్రాఫిక్ పోలీసులు

గ్వాలియర్ ట్రాఫిక్ పోలీసులు వైరల్ వీడియోను పరిశీలించి కారుపై ఉన్న నంబర్ ప్లేట్ ఆధారంగా వాహనాన్ని గుర్తించారు. ఆ తర్వాత వాహన యజమానిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. వాహనం లుక్ మారేలా లిప్‌ స్టిక్ ముద్రలు వేయడం, ట్రాఫిక్  నిబంధనలకు విరుద్ధమని పోలీసులు వెల్లడించారు. వాహన యజమానికి పోలీసులు రూ. 5,500 జరిమానా విధించారు. అంతేకాకుండా కారుపై ఉన్న ముద్దుల గుర్తులను వెంటనే తొలగించి వాహనాన్ని శుభ్రం చేయించాలని కూడా ఆదేశించారు. దీంతో ప్రియురాలు ఇచ్చిన ప్రేమ సర్‌ప్రైజ్ చివరికి యువకుడికి భారీ ఖర్చును మిగిల్చింది. కారు అలంకరణ కోసం చేసిన వినూత్న ప్రయత్నం వైరల్ కావడమే కాకుండా పోలీసుల వరకు చేరడంతో జరిమానా కూడా తప్పలేదు.

Advertisement

ఈ ఘటన సోషల్ మీడియాలో వినూత్నంగా కనిపించాలనే ప్రయత్నం కొన్నిసార్లు లేని సమస్యలకు దారితీస్తుందనే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. మొత్తానికి, ప్రియుడిని సర్‌ప్రైజ్ చేయడానికి యువతి చేసిన 3,400 ముద్దుల సర్‌ప్రైజ్, చివరికి రూ. 5,500 ఫైన్ కథగా మారిపోయింది.

Read Also: మహారాష్ట్రలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు మరాఠీ తప్పనిసరి ఎందుకు చేశారు? కారణాలేంటీ?

Tags

Related News

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 25 గంటల తర్వాత అన్ని స్టేషన్లు ఓపెన్!

రైళ్ల రద్దుపై కీలక అప్‌డేట్.. ఇండియన్ రైల్వే ఏం చెప్పిందంటే!

రన్నింగ్ ట్రైన్ లోనూ కన్ఫార్మ్ టికెట్ పొందొచ్చు, IRCTCలో ఈ సింపుల్ ట్రిక్ ఫాలోకండి!

బ్లింకిట్ గా మారిపోయిన ఇండియన్ రైల్వే.. రిక్వెస్ట్ పెట్టిన 10 నిమిషాల్లోనే డైపర్లు వచ్చేశాయ్!

రైలు క్యాన్సిల్ అయినా నో టెన్షన్.. టికెట్ డబ్బులు సింపుల్ గా ఇలా పొందవచ్చు!

IRCTC సూపర్ టూర్ ప్యాకేజీ.. భాగ్యనగర అందాలతో పాటు శ్రీశైలం మల్లన్న దర్శనం కూడా!

జస్ట్ రూ.70 వేలకే శ్రీలంక టూర్.. ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ప్యాకేజీ వివరాలివే!

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. యాదాద్రిలో ఆగనున్న ప్రత్యేక రైళ్లు!

Big Stories

Advertisement
×