BigTV English

YS Jagan: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన జగన్.. ఎందుకంటే ?

YS Jagan: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన జగన్.. ఎందుకంటే ?

YS Jagan news today(Latest political news in Andhra Pradesh):

వైఎస్ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిగత భద్రత విషయంలో ఆయన కోర్టును ఆశ్రయించారు. తనకు ఉన్న సెక్యూరిటీని కొనసాగించేలా కోర్టు ఆదేశాలు జారీ చేయాలని జగన్ పిటిషన్ లో పేర్కొన్నారు. అంతే కాకుండా కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా సెక్యురిటీని తొలగించినట్టు జగన్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.


తాజాగా ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వం ఏకపక్షంగా తనకు ఉన్న సెక్యూరిటీ తొలగించినట్లు తెలిపారు. తనను అంతమొందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అలాగే తనకు ప్రాణహాని ఉన్న అంశాన్ని పరిశీలించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని అన్నారు. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా లేదని పిటిషన్‌లో తెలిపారు.

టీడీపీ తనకు భద్రత తగ్గించిందని ఆరోపించారు. భద్రత తగ్గింపు విషయంపై తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని అన్నారు. గతంలో తనకు ఉన్న భద్రత పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో వెల్లడించారు. ఇదిలా ఉంటే జగన్ ఆరోపణలను పోలీసులు, ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. సీఎం మోదాలో అదనంగా ఇచ్చే భద్రతను మాత్రమే కుదించినట్లు తెలిపారు. రూల్స్ ప్రకారమే జగన్ కు భద్రత కల్పిస్తున్నామని అన్నారు. సీఎం స్థాయి భద్రత కల్పించడం వీలు కాదని స్పష్టం చేశారు. మరో వైపు జగన్ పిటిషన్ రెండు రోజుల్లో హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Also Read: పిన్నెల్లికి మళ్లీ నిరాశే.. బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

జగన్ వినుకొండ పర్యటన సందర్భంగా భద్రత గురించి చర్చ జరిగింది. ఫిట్ నెస్ లేని వాహనం కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ.. జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును వదిలేసి వేరే కారులో వెళ్లడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. అయితే దీనిై కూడా అధికారులు క్లారిటీ ఇచ్చారు. కండీషన్ లో లేని వాహనాన్ని ఇచ్చారనే ఆరోపణలను తోసిపుచ్చారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ జగన్ కు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×