BigTV English

Spirit: ప్రభాస్ తో నాలుగోసారి రొమాన్స్ చేయనున్న క్యూట్ బ్యూటీ.. ?

Spirit: ప్రభాస్ తో నాలుగోసారి రొమాన్స్ చేయనున్న క్యూట్ బ్యూటీ.. ?

Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే కల్కితో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన ప్రభాస్.. ప్రస్తుతం రాజాసాబ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇది కాకుండా డార్లింగ్ చేతిలో ఉన్న సినిమాప్ స్పిరిట్.


అనిమల్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్లనుందో అని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని సందీప్ ఎన్నో ఈవెంట్స్ లో చెప్పుకొచ్చాడు. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా నిమిషాల్లో వైరల్ అవుతున్న విషయం తెల్సిందే.

ఇప్పటికే.. స్పిరిట్ లో ప్రభాస్ డబుల్ రోల్ లో నటిస్తున్నాడని రూమర్స్ వచ్చాయి. ఇక తాజాగా అందుతున్నసమాచారం ప్రకారం ఈ చిత్రంలో ప్రభాస్ సరసన త్రిషను హీరోయిన్ గా అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే త్రిషతో సందీప్ సంప్రదింపులు జరిపారని, ఆమె కూడా ఓకే చెప్పిందని టాక్ నడుస్తోంది. ప్రభాస్ – త్రిష పెయిర్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.


వర్షం సినిమాతో త్రిష కెరీర్ మొదలయ్యింది. ఈ సినిమా ప్రభాస్ కు, త్రిషకు మంచి గుర్తింపు వచ్చింది. దీని తరువాత వీరి కాంబోలో బుజ్జిగాడు, పౌర్ణమి సినిమాలు వచ్చాయి. ఇక నాలుగోసారి వీరి కాంబో స్పిరిట్ తో రిపీట్ కానుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెట్టుకుంటున్నారు. మరి ఈ సినిమాతో ఈ జంట ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×