Jagan: వైసీపీ అధినేత జగన్, పార్టీ నేతలకు పల్నాడు ఘటన టెన్షన్ వెంటాడుతోంది. టూర్ ఏమోగానీ మొత్తం ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఆ ఘటనపై ఆలస్యంగా రియాక్ట్ అయిన పోలీసులు, జగన్ సహా మిగతా నేతలపై కేసులు నమోదు చేశారు. అరెస్టు తప్పదని భావించిన జగన్, బుధవారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఆ పిటిషన్ విచారణకు రానుంది.
జగన్‌కు పల్నాడు టూర్‌కు సంబంధించి అసలు టెన్షన్ మొదలైంది. జగన్ వాహనం కింద సింగయ్య అనే వ్యక్తి దుర్మరణం చెందారు. ఆ పర్యటన నేపథ్యంలో ముగ్గురు చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఆలస్యంగా తేరుకున్నా పోలీసులు, దర్యాప్తు మొదలుపెట్టారు. ఆదివారం జగన్ కారు డ్రైవర రమణారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు.
ఆ తర్వాత మంగళవారం మాజీ సీఎం జగన్‌కు నోటీసులు ఇచ్చారు. ప్రమాదానికి గురైన జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు సీజ్ చేసి నల్లపాడు పోలీసుస్టేషన్‌కి తరలించారు. రేపటి నుంచి అరెస్టులు చేయాలని ఆలోచన చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో బుధవారం పార్టీ ఆఫీసులో ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం నిర్వహించారు.
వారి నుంచి తీసుకున్న సమచారం ఆధారంగా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. జగన్‌తోపాటు ఆయన కారు డ్రైవర్ రమణారెడ్డి, పీఏ నాగేశ్వరర్ రెడ్డి, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్నినాని, విడుదల రజనీని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. అరెస్టుల భయంతో వారంతా న్యాయస్థానంలో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై గురువారం విచారణ చేపడతామని న్యాయస్థానం తెలిపింది.
ALSO READ: బ్యాగ్ కానిస్టేబుల్‌దే అయినా శ్రీశైలం బుల్లెట్ కేసులో అనుమానాలు
విచారణ సందర్భంగా ఈ కేసుకు సంబంధించి ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. ఈ కేసు ఏమోగానీ వైసీపీ నేతలకు ఒకదాని తర్వాత మరొకటి కేసులు వెంటాడుతున్నాయి. నేతలను కేసులు వెంటాడడంతో ఆ పార్టీ కేడర్ ఆలోచనలో పడింది.
అరెస్టుల నుంచి నేతలు ఏదో విధంగా బయపడతారని, తమ పరిస్థితి ఏంటని చర్చించుకోవడం మొదలైంది. ఇకపై జగన్ పర్యటనలకు వెళ్లి ఇబ్బందులు తెచ్చుకోవడం ఎందుకని అంటున్నారు. మొత్తానికి జగన్‌పై కేసు నమోదు చేయడంతో కేడర్ ఆలోచనలో పడినట్టు కనిస్తోంది.
జగన్ ప్రయాణించిన AP40 DH 2349 కారును నల్లపాడు పోలీసులు సీజ్ చేశారు.
కారు కీస్ ఇవ్వాలని పార్టీ కార్యాలయ ప్రతినిధులకు తెలిపారు.#AndhraPradesh #TDPTwitter pic.twitter.com/1AD8Jdv7tB
— 𝗧𝗗𝗣 𝗧𝗿𝗲𝗻𝗱𝘀 (@Trends4TDP) June 24, 2025