BigTV English

Jagan House Private security: జగన్ ఇంటికి భద్రత, 30 మంది ప్రైవేటు సెక్యూరిటీ

Jagan House Private security: జగన్ ఇంటికి భద్రత, 30 మంది ప్రైవేటు సెక్యూరిటీ

Jagan House Private security: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు వైసీపీ అధినే జగన్. ఒకప్పుడు ఇంటి నుంచి జగన్ బయలు దేరితే పోలీసులు భారీ ఎత్తున ఉండేవారు. 75 నుంచి 100 మంది పోలీసులు ఉండేవారు. అధికారం పోయిన తర్వాత వేగంగా మార్పులు జరగడాన్ని గమనించారు. ఎన్నికల్లో ఓడిపోయిన మంత్రుల సెక్యూరిటీని వెనక్కి తీసుకుంటోంది అధికార ప్రభుత్వం. ఇప్పటికే చాలా మందికి భద్రత తొలగించింది.


ఈ లెక్కన అధినేత జగన్‌కు సెక్యూరిటీ కుదించే అవకాశముందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ సెక్యూరిటీ కుదిస్తే లేనిపోని సమస్యలు వస్తాయని భావిస్తున్నారట. గతంలో చంద్రబాబుకు జరిగినట్టుగానే జగన్‌కు జరిగే అవకాశముందని అనుకుంటున్నారట. గతంలో చంద్రబాబు సెక్యూరిటీని కుదించింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబుకు 125 మందిపైగా పోలీసులు ఉండేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ భద్రతను 75కు తగ్గించారు. దీనిపై అప్పట్లో టీడీపీ న్యాయస్థానానికి వెళ్లింది.

ప్రజెంట్ లోకి వచ్చేద్దాం.. విపక్ష హోదా వచ్చినా వైసీపీకి కొంతలో కొంత సెక్యూరిటీ ఉండేది. ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి ప్రత్యర్థులకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకూడదని భావిస్తున్నారట జగన్. ఈ క్రమంలో ప్రైవేటీ సెక్యూరిటీపై దృష్టి సారించారు. ఓ ప్రైవేటు ఏజెన్సీ నుంచి దాదాపు 30 మందిని ఆయన నియమించుకున్నట్లు తెలుస్తోంది.


ALSO READ: అడ్డం తిరిగిన వాలంటీర్ల కథ.. నిండా ముంచేసిన జగన్‌!

సోమవారం ఉదయం ప్రైవేటు సెక్యూరిటీ తాడేపల్లి ప్యాలస్‌కు వచ్చారు. వెంటనే విధుల్లోకి జాయిన్ అయ్యారు. షిఫ్ట్‌కి పది మంది చొప్పున మూడు షిఫ్ట్‌‌ల్లో విధులు నిర్వహించనున్నారట. తెలంగాణలో వైసీపీకి సంబంధించి ఓ వ్యక్తి ఏజెన్సీ నుంచి వీరందరినీ నియమించుకున్నట్లు తెలుస్తోంది. జగన్ జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారని అంటున్నాయి పార్టీ వర్గాలు.

 

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×