BigTV English

Jagan Media: కేసుల విషయంలో జగన్ మీడియా నిజాలు రాయలేదా..?

Jagan Media: కేసుల విషయంలో జగన్ మీడియా నిజాలు రాయలేదా..?

బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న 11మంది ఇన్ ఫ్లూయెన్సర్లపై తెలంగాణలో కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి ఇది పెద్ద వార్తే. క్రైమ్ ఎలిమెంట్ కాబట్టి మీడియాలో హడావిడి బాగా ఎక్కువగానే ఉంది. అయితే సాక్షి మాత్రం తేలు కుట్టిన దొంగలా మారింది. ఎందుకంటే ఆ 11 మందిలో వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల కూడా ఒకరు కాబట్టి.


బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న 11మందిపై కేసు నమోదైంది. హైదరాబాద్ మియాపూర్‌ కి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి చేసిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 11 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ 11 మంది ఎవరు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
విష్ణుప్రియ, సుప్రీత, రీతు చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, సన్నీయాదవ్, ఇమ్రాన్, కిరణ్‌ గౌడ్, సుధీర్‌ రాజ్, అజయ్‌, యాంకర్ శ్యామల ఈ లిస్ట్ లో ఉన్నారు. మిగతా మీడియా సంస్థలన్నీ అందరి పేర్లతో వార్తలిచ్చాయి. కానీ జగన్ కి చెందిన సాక్షి మీడియాకి మాత్రం ఈ వార్తని ఎలా కవర్ చేయాలో అర్థం కాలేదు. ఎలా కవర్ చేయాలి అనే దానికంటే.. ఎవర్ని కవర్ చేయాలి అనే విషయంపైనే ఎక్కువ దృష్టిపెట్టినట్టుంది. అందుకే యాంకర్ శ్యామలను కవర్ చేసేలా వారి కథనం సాగింది. ఈ కేసులో ఎంతమందిపై కేసు నమోదైందనే విషయాన్ని సాక్షి చెప్పలేదు. కేవలం వారి పేర్లను మాత్రమే ఇచ్చింది. అది కూడా 10 మంది పేర్లు చెప్పి కేవలం యాంకర్ శ్యామల పేరు మాత్రం ఉద్దేశపూర్వకంగానే తొలగించింది. ఆ పదిమందితోపాటు ‘తదితరులు’ అంటూ యాంకర్ శ్యామలని కవర్ చేసింది.

Sakshi article
Sakshi article

ఎన్ని కష్టాలు..?
2024 ఎన్నికల సమయంలో వైసీపీ తరపున చాలామంది ప్రచారం చేశారు కానీ, ఫలితాల తర్వాత అందరూ సైలెంట్ అయ్యారు. పార్టీ తరపున మాట్లాడేవారే కరువయ్యారు. ఈ దశలో యాంకర్ శ్యామల వైసీపీకి అండగా నిలబడ్డారనే చెప్పాలి. ఆమెకు అధికార ప్రతినిధి అనే హోదా కూడా ఇవ్వడంతో పార్టీ తరపున వివిధ వేదికలపై ఆమె మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆమెకు ఫాలోయింగ్ ఉండటంతో వైసీపీ వాయిస్ జనంలోకి వెళ్తోంది. ఇలాంటి టైమ్ లో ఆమెపై కేసు పెట్టడం సహజంగానే వైసీపీకి షాకింగ్ న్యూస్. వాస్తవానికి ఈ కేసు ఏపీలో నమోదయితే రాజకీయ కక్ష అని పెద్ద రచ్చ చేసేవారు. కానీ తెలంగాణ పోలీసులు కేసు పెట్టారు. అది కూడా రాజకీయాలకు సంబంధం లేని విషయంలో. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన సెలబ్రిటీల లిస్ట్ లో ఆమె పేరు కూడా ఉంది. పోనీ అది కూడా అబద్ధం అని చెబుదామంటే కుదిరేది కాదు. బెట్టింగ్ యాప్స్ ని తానే స్వయంగా ప్రమోట్ చేస్తూ శ్యామల తన సోషల్ మీడియా అకౌంట్లలోనే వీడియోలు ఉంచారు. దీంతో ఆమె రియాక్ట్ కావడానికి, తన తప్పులేదు అని చెప్పడానికి కూడా ఛాన్స్ లేదు. అందుకే సాక్షికి కష్టమొచ్చింది. యాంకర్ శ్యామలను కవర్ చేయడానికి కష్టాలు పడుతోంది.


ఈ ఒక్క విషయంలోనే కాదు, వైసీపీకి చెందిన చాలామంది కేసుల వ్యవహారాలను కూడా సాక్షి ఇలాగే కవర్ చేయాలని చూస్తూ కష్టాలు పడుతోంది. పోసాని కృష్ణ మురళి కేసు, బోరుగడ్డ అనిల్ కేసుల విషయంలో కూడా సాక్షి సరైన కవరేజ్ ఇచ్చుకోలేని పరిస్థితి. అదిగో బెయిల్ ఇదిగో పోసాని రిలీజ్ అవుతున్నాడంటూ సాక్షి గత కొన్ని రోజులుగా వార్తలిస్తోంది. మొదట్లో లాయర్ ని పెట్టి హడావిడి చేసింది. ఆ తర్వాత వైసీపీ నేతలు తనని కలవడానికి వచ్చినా పోసాని మొహం తిప్పేసుకోవడంతో ఆయన కేసుని సాక్షి కూడా లైట్ తీసుకున్నట్టుంది. కేవలం రాజకీయ కక్షసాధింపు అని మాత్రం కథనాలిస్తోంది. ఇక బోరుగడ్డ వ్యవహారంలో సాక్షిది మరీ ఇరకాటం. కనీసం బోరుగడ్డ ఎవరు, ఏంటి, కేసు ఎందుకు అనే వివరాలు కూడా సాక్షిలో కనపడవు. ఓవైపు తనని జగన్ కాపాడాలంటూ బోరుగడ్డ విన్నపాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ అతను జగన్ కి అభిమాని అని సాక్షి చెప్పలేని పరిస్థితి. వైసీపీ వైరి వర్గాన్ని బోరుగడ్డ తిడుతుంటే ఆ పార్టీ నేతలు సంబర పడ్డారు, సంతోషపడ్డారు. కానీ ఇప్పుడు అతడిని పోలీసులు అరెస్ట్ చేస్తే మాత్రం తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారు.

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×