Social Responsibility:ఈ మధ్య కాలంలో భిక్షాటన చేసే వారి సంఖ్య బాగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. దేవాలయాలు, షాపింగ్ మాల్స్, మూవీ థియేటర్స్ , బస్ స్టాప్స్ , రైల్వే స్టేషన్ ఇలా ఒక్కటేమిటి.. ఎక్కడపడితే,అక్కడ వచ్చి పోయే వారిని తెగ ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే ఇలాంటి భిక్షాటన చేసే వారు ఒక్క భారతదేశంలోనే ఎక్కువగా కనిపిస్తారని పలువురు కామెంట్లు చేస్తూ ఉంటారు. అయితే వీరు ఏ కారణాల చేత యాచకులుగా మారారో తెలియదు. అయితే ఇలాంటి భిక్షాటన రహిత ప్రపంచాన్ని సాధించాలనే సందేశాన్ని తెలిపేలా.. “ధర్మ యుగం” పేరుతో ఒక సందేశాత్మక పాటను లాంచ్ చేశారు స్ఫూర్తి విజేత విద్యాసంస్థలు.
హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్ వేదికగా ‘ధర్మయుగం: హ్యుమానిటీ బెగ్గర్ ఫ్రీ సిటీ’ అనే ట్యాగ్ లైన్ తో పాటను రిలీజ్ చేయడం జరిగింది ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ఈ పాటను లాంచ్ చేయడం గమనార్హం. ఈ సందర్భంగా విజేత విద్యాసంస్థల చైర్మన్ మాట్లాడుతూ.. ప్రముఖ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్,సింగర్ వందేమాతరం శ్రీనివాస్ సామాజిక బాధ్యతను చాటుకునేందుకు ఈ పాటను రూపొందించారు అని తెలియజేశారు. ముఖ్యంగా ఈ పాట ద్వారా..అందరూ కలిస్తే సమాజాన్ని బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చవచ్చని తెలిపారు. అంతేకాదు ఈ సందర్భంగా వివిధ రంగాల వారిని.. సామాజిక బాధ్యతగా చేస్తున్న కృషిని గుర్తిస్తూ పలు అవార్డులతో సత్కరించారు.
ప్రత్యేకించి అనాధలకు లాస్ట్ రైట్స్ నిర్వహిస్తున్న ఎన్జీవో, భిక్షాటన రూపుమాపేందుకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలతోపాటు, పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్న డాక్టర్స్ ను ఈ అవార్డులతో సన్మానించారు. బెగ్గర్ ఫ్రీ సొసైటీనీ క్రియేట్ చేయడానికి విజేత పూర్వ విద్యార్థులు కలిసి సమాజంలో అవగాహన కల్పించడం సంతోషంగా ఉందని తెలిపిన విజేత విద్యాసంస్థల చైర్మన్.. సోషల్ రెస్పాన్సిబిలిటీని ప్రదర్శిస్తున్న ‘ధర్మ యుగం’ పాట ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని తెలిపారు. ఇకపోతే ప్రస్తుతం ఉన్న కలియుగంలో ధర్మాన్ని రక్షించినప్పుడే.. ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది.. అనే సందేశం తోనే ముందడుగు వేస్తున్నాం అంటూ విజేత పూర్వ విద్యార్థుల తో పాటు ఎన్జీవో సంస్థల ప్రతినిధులు కూడా తెలిపారు.
నగరాలలో, వివిధ రకాల అసమానతలకు గురైన వారు, ఆర్థిక అవసరాల కోసం అనాధలుగా మారిన చిల్డ్రన్స్, హోమ్ లెస్ సీనియర్ సిటిజన్స్, ట్రాఫికింగ్ ద్వారా ఎంతో మంది మహిళలు భిక్షాటనలోకి బలవంతంగా వస్తున్నారు. యాచకత్వంలో మగ్గిపోయే వారిని రక్షించేందుకు అటు స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు, ప్రభుత్వాలు పనిచేస్తున్నప్పటికీ.. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ముందుకు వచ్చి, భిక్షాటనలోకి నెట్టబడుతున్న వారిని తమ వంతు సహాయంతో రక్షించాలని పలువురు కోరారు. అప్పుడే పూర్తిస్థాయిలో బిచ్చం అడుక్కొని బతికే వాళ్ళు, చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులను బయటకు తీసుకురావచ్చని తెలిపారు. ఇకపోతే ఈ పాటకు డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహించగా.. ప్రొడ్యూసర్ బి హెచ్ వి రామకృష్ణరాజు నిర్మించారు. ఇక ఈ పాటలో నటుడు నంద కిషోర్ నటించారు. ఇక వీరంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.