BigTV English

Jagan New Advisor: ఫ్యాన్‌కు రిపేర్లు.. జగన్ సలహాదారుడిగా సాయిదత్.. అజ్ఞాతంలో సజ్జల!

Jagan New Advisor: ఫ్యాన్‌కు రిపేర్లు.. జగన్ సలహాదారుడిగా సాయిదత్.. అజ్ఞాతంలో సజ్జల!

Jagan New Advisor: అధికారం పోయిన తర్వాత వైసీపీలో ఊహించని మార్పులు జరుగుతున్నాయా? గడిచిన ఐదేళ్లు పని చేసినవారిని జగన్ ఎందుకు దూరం పెట్టారు? మోసం పోయానని ఆలస్యంగా అధినేత తెలుసు కున్నారా? ముంచుకొస్తున్న కేసుల నేపథ్యంలో వాళ్లని దూరం పెట్టారా? ఇంతకీ వైసీపీ సలహాదారు సజ్జల ఎక్కడ? ఆయనను అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా.. లేక పంపించారా? వైసీపీ కొత్త పొలిటికల్ సలహాదారు మోహన్‌కు పూర్తి స్థాయి బాధ్యతలు ఇచ్చినట్టేనా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


2024 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది వైసీపీ. ఎవరూ ఊహించని విధంగా కేవలం 11 సీట్లకు పడిపోయింది. తాను చేసిన లోపాలు తెలుసుకున్న మాజీ సీఎం జగన్.. ఓటమిపై పార్టీ నేతలతో కనీసం చర్చించ లేదు. నేరుగా బెంగుళూరు వెళ్లిపోయారు. అక్కడ తన ఆలోచనకు పదునుపెట్టారు.

ALSO READ:  తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం


చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక చట్ట ప్రకారం పార్టీ నేతలను ఇరుకుస్తున్న విషయాన్ని ఆలస్యంగా గమనించారు జగన్‌బాబు. వైసీపీ సర్కార్‌లో తిరుగులేని నేతలుగా చెలామణి అయిన వారిని పక్కన పెట్టేశారు. రాబోయే రోజుల్లో ఆయా నేతలకు కేసుల ముప్పు పొంచివుందని గమనించారు. కొత్తవారికి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఫ్యాన్ పార్టీలో తిరుగుబాటు మొదలైందని చాలామంది నేతలు భావించారు. కానీ జగన్ తీసుకున్న నిర్ణయాలపై పార్టీలో ముఖ్య నేతలతో చర్చించలేదట.

వైసీపీలోనే కాదు సోషల్‌మీడియా ఇలా రకరకాల విభాగాలను ప్రక్షాళన చేస్తున్నారు అధినేత. జగన్‌కు అన్నీ తానై వ్యవహరించిన సలహాదారు సజ్జలను పక్కన పెట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన ను అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలని సూచన చేసినట్టు అంతర్గత సమాచారం. ఎన్నికల తర్వాత ఆయన పెద్దగా మీడియా ముందు రాలేదు. చివరకు బెడవాడ వరదల సమయంలోనూ కనిపించలేదు.

సజ్జల స్థానంలో కొత్త సలహాదారుని జగన్ తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఆళ్ల మోహన్ సాయిదత్‌ను బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. వైసీపీ పునర్నిర్మాణం దిశగా వెళ్లుతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో పార్టీలో ఊహించని మార్పులు జరుగుతున్నాయి. దీన్ని ముందుగానే పసిగట్టిన కొందరు నేతలు ఆ పార్టీకి రాంరాం చెప్పేస్తున్నారు. మరికొందరు వెయిట్ చేస్తున్నారు.

ఇంతకీ మోహన్ సాయిదత్ ఎవరు? ఇంకా లోతుల్లోకి వెళ్తే.. చెన్నై ఐఐటీల్లో చదివారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పని చేసినట్టు తెలుస్తోంది. అంతకుముందు నారా లోకేష్‌కు వ్యూహకర్తగా పని చేశారట. ఈ క్రమంలో ఆయన్ని ఏరి కోరి తెచ్చారట అధినేత జగన్.

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎలాంటి మీటింగులు పెట్టుకుండా.. బెంగుళూరులో సాయిదత్‌తో సమావేశం కావడం, ఆయన సలహా మేరకు జగన్ చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. ఈ లెక్కన సజ్జలకు, ఐప్యాక్‌కు సాయిదత్‌తో రీప్లేస్ చేశారని అంటున్నారు.

కేసుల నిమిత్తం నేతలను పక్కన పెడుతున్నారని.. ఆ తర్వాత వారికీ ప్రాధాన్యత ఉంటుందని ఆ పార్టీలో కొందరు నేతల మాట. అందుకే మీడియా ముందు ఎవర్నీ రాకుండా కేవలం జగన్ మాట్లాడడం వెనుక ఇదే అసలు కథని అంటున్నారు. పూర్తిగా చతికిలపడిన ఫ్యాన్‌ను సాయిదత్ ఆక్సిజన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. అన్నట్లు.. వచ్చే ఎన్నికల నాటికైనా ఫ్యాన్ స్పీడ్‌గా తిరుగుతుందా లేదా అన్నది చూడాలి.

Related News

Free Electricity In AP: తెలంగాణ బాటలో ఏపీ సర్కార్.. వారందరికీ ఉచిత విద్యుత్

Smart Ration cards: ఏపీలో ప్రారంభమైన స్మార్ట్‌ రేషన్ కార్డుల పంపిణీ

Jagan Tour: జగన్ తిరుమల పర్యటన.. మళ్లీ డిక్లరేషన్ లొల్లి, నో అంటున్న వైసీపీ

AP DSC verification: ఏపీ డీఎస్సీ వెరిఫికేషన్‌ వాయిదా.. రాత్రి ప్రకటన వెనుక

AP New Scheme: సీఎం చంద్రబాబు కొత్త స్కీమ్.. కోటి వరకు, వారంతా ఆనందంలో

CM Progress Report: 51వ CRDA సమావేశం.. అమరావతి డెవలప్‌మెంట్‌కు ఎన్ని కోట్లు అంటే..!

Big Stories

×