Jyothi Rai giving wildcard entry to big boss 8: బుల్లితెర నటిగా జ్యోతిరాయ్ గుప్పెడంత మనసు ద్వారా జగతి మేడమ్ గా పాపులర్. అందులో ఆమె వేసింది తల్లి పాత్ర. దాదాపు నాలుగు పదుల వయసు. ఈ మధ్య సోషల్ మీడియాలో తన హాట్ భంగిమలతో యూత్ ని తెగ రెచ్చగొడుతోంది. సీరియల్ లో జగతి మేడమ్ గా పాపులర్ అయిన జ్యోతిరాయ్.. హాట్ గెటప్స్ తో తనకి తానే కూతురుగా మారిపోయింది. ఆమె హాట్ ఫొటో షూట్ చేస్తే ఎవరైనా సీరియల్ నటి ఈమెకు తల్లే అనుకుంటారు. అంతలా షాకిస్తోంది జనాలకు. కర్ణాటకకు చెందిన జ్యోతిరాయ్ మొదట్లో సినిమాలలో చిన్న క్యారెక్టర్లు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కన్నడ టీవీ సీరియల్ నటిగా పాపులారిటీ తెచ్చుకుంది.
మోడల్ గా కెరీర్
కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటించింది ఈ బ్యూటీ. మోడల్ గా తన కెరీర్ ని మొదలుపెట్టిన జ్యోతిరాయ్ తమిళ, కన్నడ, తెలుగు టీవీ సీరియల్స్ లో నటిస్తూ అలరిస్తోంది. అయితే ఆమె వయసు దృష్ట్యా ఆమెకు తల్లి, వదిన పాత్రలే వస్తున్నాయి. తెలుగులో మాత్రం గుప్పెడంత మనసు టీవీ సీరియల్ లో ఆమె చేసిన జగతి మేడమ్ గా బాగా పాపులర్ అయ్యారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఇప్పుడు జ్యోతిరాయ్ ని ఎక్కడైనా సరే ఇట్టే గుర్తుపట్టేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్ కూడా చేస్తోంది.
సోషల్ మీడియాలో రచ్చ
ఈ మధ్య సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. నాలుగు పదుల వయసులో ఇలాంటి హాట్ షూట్ ఫొటోలు ఏమిటని విమర్శించిన వారు కూడా లేకపోలేదు. అయినా తన బ్యూటీ అందాలను బహిర్గతం చేస్తూ ఈ మధ్య కొన్ని శృంగార ఫోజులతో ఫోటోలను వదిలింది. షర్ట్ విప్పి లోపల జాకెట్ జిప్ సగానికి తీసి తన ఎద అందాలను చూపిస్తూ జ్యోతిరాయ్ రచ్చ చేస్తోంది. నెటిజన్లు అంతా జ్యోతిరాయ్ వయసు కూడా మర్చిపోయి వావ్ అంటున్నారు. నేటి మేటి హీరోయిన్లు కూడా ఇంత హాట్ గా చూపించడం లేదని.. జ్యోతిరాయ్ వయసు నిజంగానే ఇరవై సంవత్సరాలు తగ్గిపోయిందని కామెంట్స్ పెడుతున్నారు.
వైల్డ్ కార్డ్ ఎంట్రీ
ఇలా హాట్ ఫొటోలతో షాకుల మీద షాకులిస్తున్న జ్యోతిరాయ్ బుల్లితెర ప్రేక్షకులకు మరో షాక్ ఇవ్వబోతోంది. బిగ్ బాస్ సీజన్ 8 అంతా ఇప్పటిదాకా పెద్దగా పరిచయం లేని కంటెస్టెంట్లతో సాగుతోంది. తొలి వారంలోనే బేబక్క వెళ్లిపోయింది. మిగిలిన కంటెస్టెంట్లు తొలి రోజు నుంచే గొడవలు మొదలు పెట్టారు. అయితే ఇప్పటిదాకా జనం ఏదో డైలీ సీరియల్ చూసినట్లుగా ఈ రియాలిటీ షోను చూస్తున్నారే తప్ప ఏ మాత్రం కిక్ రావడం లేదు. రేటింగ్ కూడా తేడా వచ్చిందని భావించిన బిగ్ బాస్ యాజమాన్యం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరికొందరికి అవకాశం ఇద్దామని అనుకుంటున్నారు. మొన్నటిదాకా రీతూ చౌదరి వస్తుందని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే అంతకన్నా ముందు జగతి మేడమ్ గా పాపులర్ అయిన జ్యోతిరాయ్ కి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారట బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే జ్యోతిరాయ్ బిగ్ బాస్ లో తన అందాలతో ఆకట్టుకుంటుందా? లేక వయసు రీత్యా అందుకు తగినట్లుగా ప్రవర్తిస్తుందా? వేచి చూడాలి అని బిగ్ బాస్ రియాలిటీ షో వీక్షకులు ఎదురుచూస్తున్నారు.