Vijayasai Reddy vs Jagan: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు. సమయం వచ్చిన కొందరు నేతలు తరచూ చెప్పే మాట. ఒకప్పుడు క్లోజ్‌గా ఉన్న జగన్ -విజయసాయిరెడ్డి మధ్య ఎక్కడ చెడింది? జగన్ మాటలపై వీఎస్ఆర్ ఆ స్థాయిలో ఎందుకు రియాక్ట్ అయ్యారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
రెండువారాల కిందట వైసీపీ సభ్యత్వానికి, రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. ఆ తర్వాత ఆయన మీడియా ముందుకొచ్చి చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పారు. కనీసం జగన్‌ని పల్లెత్తి మాట కూడా అనలేదు. పైగా జగన్ ఫ్యామిలీని వెనుకేసుకొచ్చారు. ఎందుకు అలా జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు.
సరిగ్గా అదే సమయంలో జగన్ లండన్ పర్యటనలో ఉన్నారు. రాజకీయాలకు గుడ్ బై విషయం అధినేతకు ఫోన్ చేసి చెప్పానని మీడియాకు వివరించారు విజయసాయిరెడ్డి. ఆ ఫ్యామిలీతో తనకు దశాబ్దాల అనుబంధం ఉందన్నారు. ఆ తర్వాత వీఎస్ఆర్ సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత వ్యవసాయానికి సంబంధించి వాహనాలను సమకూర్చుకున్నారు.
గురువారం మీడియా ముందుకొచ్చిన మాజీ సీఎం జగన్‌ను విజయసాయిరెడ్డి రాజీనామాపై గుచ్చిగుచ్చి ప్రశ్నలు లేవనెత్తింది. పార్టీ నుంచి ఎంతమంది వెళ్లినా ఎలాంటి నష్టం లేదన్నారు వైసీపీ అధినేత. అంతేకాదు మరో మాట కూడా చెప్పారు. రాజకీయాల్లో క్యారెక్టర్ చాలా కీలకమన్నారు. క్యారెక్టర్ లేకుండా వెళ్లిన విజయసాయిరెడ్డికైనా మిగతా అందరికీ ఇది వర్తిస్తుందన్నారు.
ALSO READ: ఉత్తరాంధ్ర కొత్త బాస్ ఎవరు? రేసులో బొత్స.. హైకమాండ్ మాటేంటి?
క్యారెక్టర్ అనే పదం ఎత్తడంపై సమావేశంలో మీడియా మిత్రులు షాకయ్యారు. విజయసాయిరెడ్డిని జగన్ అంతమాట ఎలా అనేశారని చర్చించుకోవడం నేతల్లో మొదలైంది. శుక్రవారం ఉదయం న్యూస్ పేపర్లు చదివిన విజయసాయిరెడ్డి.. సరిగ్గా జగన్ మాటలకు తనదైన శైలిలో ఎక్స్ వేదికగా కౌంటరిచ్చారు.
వ్యక్తిగత జీవితంలో విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడ్ని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదన్నారు. భయం అనేది నాలో ఏ అణువు అణువులోనూ లేదన్నారు. కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవులకు రాజీనామా చేశాను.. రాజకీయాలనే వదులుకున్నానని రాసుకొచ్చారు.
ఉన్నట్లుండి విజయసాయిరెడ్డి ఈ స్థాయిలో రియాక్ట్ కావడంపై ఇటు వైసీపీ నేతలు, అటు కేడర్ ఒక్కసారిగా షాకైంది. అంతర్గతంగా జగన్-విజయసాయిరెడ్డి మధ్య ఎక్కడో చెడిందని అంటున్నారు. లేకుంటే వీఎస్ఆర్ ఈ స్థాయిలో రియాక్ట్ కావాల్సిన అవసరం లేదని అంటున్నారు. మరి వీఎస్ఆర్ కామెంట్స్‌పై వైసీపీ రియాక్ట్ అవుతుందా? మళ్లీ మీడియా ముందుకొచ్చినప్పుడు స్వయంగా జగన్ రిప్లై ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
పొలిటికల్ సర్కిల్స్ నుంచి బలంగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఎన్నికల్లో ఓటమి తర్వాత వీఎస్ఆర్ బీజేపీలోకి వెళ్లాలని భావించారట. తనతోపాటు మరో ఐదారు ఎంపీలను తీసుకెళ్లాలని ఆలోచన చేశారట. తమ పార్టీలో చేరే విషయమై కూటమి నేతలతో చర్చించి నిర్ణయం చెబుతామని బీజేపీ పెద్దలు చెప్పారట. ఈలోగా ఆ విషయం జగన్ చెవిలో పడిందట. ఈ క్రమంలో వీఎస్ఆర్‌ను పిలిచి ఆయన కాస్త మందలించినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ తర్వాత రెండు నెలల తర్వాత ఎక్స్ ద్వారా రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు వీఎస్ఆర్.
వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నా.
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 7, 2025