BigTV English

Jagan On Economy : రాష్ట్ర అప్పుల లెక్కలపై అసలు నిజాలు ఇవీ అంటున్న జగన్..

Jagan On Economy : రాష్ట్ర అప్పుల లెక్కలపై అసలు నిజాలు ఇవీ అంటున్న జగన్..

Jagan On Economy : అసెంబ్లీలో అధికార కూటమి విమర్శలకు వైసీపీ అధినేత జగన్ మీడియా సమావేశం ద్వారా సమాధానాలు ఇచ్చారు. తన హయంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, గతంలో చంద్రబాబు హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో వివరించారు.


తాడేపల్లి నివాసం నుంచి మాట్లాడిన వైఎస్ జగన్..  చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.  చంద్రబాబు, అతని పరివారమంతా అబద్దాలకు రెక్కలు కట్టి ప్రచారం చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. తన  హయాంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశామంటూ చేస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చిన జగన్.. అనేక లెక్కల్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించారు.

2019లో చంద్రబాబు అధికారం దిగిపోయేటప్పటికి రూ. 2 లక్షల 57 వేల కోట్ల అప్పులున్నాయని తెలిపిన జగన్.. ప్రభుత్వం గ్యారంటీగా ఉన్న అప్పులు రూ. 55 వేల కోట్లని వెల్లడించారు. మొత్తం రూ. 3 లక్షల 13 వేల కోట్లని అన్నారు.


ఇక వైసీపీ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయో సమయానికి రూ. 4 లక్షల 91 వేల కోట్ల అప్పులు ఉన్నాయని జగన్ ప్రకటించారు. ప్రభుత్వ గ్యారంటీ అప్పులు లక్షా 54 వేల కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. మొత్తం కలిపి.. రూ.6 లక్షల 46 వేల కోట్లు అని వెల్లడించారు. ఈ విషయాన్ని రాజ్యాంగ బద్ధ సంస్థ అయిన కాంప్రోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్ – కాగ్ (CAG) సైతం నిర్థరించిందని తెలిపారు.

ఈ నివేదికను స్వయంగా చంద్రబాబు నాయుడే.. ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారన్న వైసీపీ అధినేత జగన్.. 2023 -24 కాగ్ రిపోర్ట్ ప్రకారం ఏపీ అప్పు రూ. 6 లక్షల 46 వేల కోట్లని గణాంకాలతో సహా నిర్ధరణ అయ్యిందని వెల్లడించారు. మరి అలాంటప్పుడు..  కూటమి నాయకులు రూ. 12 లక్షల కోట్లని ఓ సారి, రూ. 14 లక్షల కోట్లు అప్పులున్నాయని మరోసారి ప్రచారం చేసారంటూ మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేయడం ధర్మమేనా అంటూ ప్రశ్నించారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×