AP women in Kuwait: భర్త చనిపోయాడు. తన పిల్లల పొట్టకూటి కోసం ఓ తల్లి ధైర్యం చేసి, కువైట్ కి వెళ్లింది. ఇక అంతా సవ్యంగా ఉంది. తన పిల్లల భవిష్యత్ బాగుంటుందని ఆశపడ్డ ఆమె కలలు.. అడియాశలయ్యాయి. ప్రస్తుతం ఎలాగైనా తన పిల్లలను దగ్గరుండి చూసుకోవాలని ఆరాటపడుతోంది. అక్కడి చిత్రహింసలను తట్టుకోలేక కన్నీటి పర్యంతమవుతూ, ఓ వీడియో విడుదల చేసింది ఆ తల్లి.
కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎల్లంమిల్లి గ్రామానికి చెందిన కుమారి అనే మహిళకు వివాహమై ఇరువురు సంతానం. అయితే భర్త మృతి చెందడంతో కుటుంబ బాధ్యతలు స్వీకరించిన కుమారి కూలీ నాలీ పనులు చేసుకుంటూ తన బిడ్డలను పోషించేది. చాలీచాలని కూలి డబ్బులతో పిల్లల పోషణ భారమై తమ కుటుంబ సభ్యులు సూచన మేరకు బ్రతుకుతెరువు కోసం కువైట్ కి వెళ్ళింది.
కువైట్ కి వెళ్లేందుకు కూడా అప్పులు చేసిన ఆ మహిళ, ఇక తన పిల్లల బంగారు భవిష్యత్తుకు ఎటువంటి ఢోకా లేదని ఆనందపడింది. అయితే పట్టుమని 7 నెలల వ్యవధిలోనే అక్కడ పడుతున్న చిత్రహింసలకు మనోవేదన చెందుతూ కాలం వెళ్లదీస్తూ వచ్చింది. కానీ రోజురోజుకు కువైట్ దేశంలో పడుతున్న చిత్రహింసలు అధికం కాగా కన్నీటి పర్యంతమవుతూ.. ఓ వీడియోను కుమారి విడుదల చేసింది.
ఆ వీడియో ఆధారంగా.. తాను బ్రతుకుదెరువు కోసం కువైట్ కు వచ్చానని, ఇక్కడ చిత్రహింసలు పెడుతూ తనను చంపేసేలా ఉన్నట్లు, పిల్లల భవిష్యత్తు కోసం వస్తే.. చివరికి తానే మిగిలేలా లేనట్లు కన్నీటి పర్యంతమైంది. తాను తీస్తున్న వీడియోను కూడా రహస్యంగా తీస్తున్నట్లు, సరిగ్గా తిండి కూడా పెట్టకుండా.. తన పిల్లలకు దూరం చేసే పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం స్పందించి తనను ఎలాగైనా ఇక్కడి నుండి తప్పించి తన పిల్లల దగ్గరికి చేర్చాలంటూ వేడుకుంటుంది కుమారి. తల్లి అక్కడ.. బిడ్డలేమో ఇక్కడ ఆకలి దప్పులతో కాలం వెళ్లదీస్తున్నారట. మొత్తం మీద ఆమె విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. మరి ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాలి.
"నన్ను చంపేసేలా ఉన్నారు.. కాపాడండి".. కువైట్ నుంచి వీడియో ద్వారా మహిళ ఆవేదన
బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లి అక్కడ పడుతున్న చిత్రహింసలపై రహస్యంగా వీడియో తీసి బంధువులకు పంపిన కుమారి అనే మహిళ
సరిగా తిండి పెట్టడం లేదు.. చంపేసేలా ఉన్నారంటూ ఆవేదన
ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించి తనను… pic.twitter.com/9ixGWEAhHa
— BIG TV Breaking News (@bigtvtelugu) November 20, 2024