Tirumala News: ఏపీలో అధికారం పోయినా వైసీపీ నేతల్లో మార్పు రాలేదా? ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమల్లో ఉన్నారా? కూటమి సర్కార్ తీసుకొచ్చిన రూల్స్ వారికేగానీ, తమకు కాదని భావిస్తున్నారా? అందుకు ఉదాహరణ తిరుమల కొండపై ఆయన రాజకీయాలు మాట్లాడడమేనా? ఆయనపై కేసు నమోదు చేయడం ఖాయమా? అవుననే అంటున్నారు టీటీడీ అధికారులు.
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో ప్రక్షాళన చేపట్టింది. వచ్చే భక్తులకు మాత్రమే కాదు, పవిత్రమైన తిరుమల కొండపై ఎవరైనా రాజకీయాలు ప్రసంగాలు చేస్తే కేసు నమోదు చేస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పదేపదే పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. అయినా కొందరు వైసీపీ నేతల తీరు మారలేదు.
రాజకీయాలను మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు.. చేశారు కూడా. తాజాగా ఆ లోవలోకి వచ్చారు జగన్ మేనమామ, వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామిని దర్శించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
వైసీపీ హయాంలో నిత్యం నేతలు రాజకీయాలపై మాట్లాడేవారు. అక్కడ మాట్లాడితే తాము చెప్పాల్సిన మెసేజ్ సూటిగా ప్రజల్లోకి వెళ్తుందని కొందరు నేతల ఆలోచన. దీన్ని కూటమి ప్రభుత్వం ఏర్పడిన రాష్ట్రంలో వర్షాలు పడలేదని వ్యాఖ్యానించారు.
ALSO READ: ఉప ఎన్నిక వేళ జగన్ కి 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే అంగీకరించారా?
అంతేకాదు సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ సీఎం కావాలని స్వామిని ప్రార్థించినట్టు చెప్పుకొచ్చారు. మరో అడుగు ముందుకేసిన ఆయన పులివెందుల, ఒంటిమిట్టల జెడ్పీటీసీ సీట్లు మంగళవారం జరగనున్న ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని మనసులోని మాట బయటపెట్టారు.
అంతేకాదు కూటమి పాలన, ఆయా రాజకీయ పార్టీలపై కామెంట్స్ సైతం చేశారు. శ్రీవారి ఆలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీటీడీ విజిలెన్స్ విభాగం పరిశీలిస్తోంది. నిబంధనల ఉల్లంఘనపై ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
నేడో రేపో కేసు నమోదు చేస్తారా? రాజకీయ నాయకులకు ఇలాంటివి సహజమేనని టీటీడీ అధికారులు సైలెంట్‌గా అనేది ఇప్పుడు చర్చ. అయితే వైసీపీ మాత్రం రవీంద్రనాథ్‌రెడ్డి అండగా ఉంటుంది. ఆయన అన్నవిషయంలో ఎలాంటి తప్పులేదని అంటున్నారు. కావాలనే వైసీపీ నేతలపై కేసులు నమోదు చేయాలని భావిస్తోందని అంటున్నారు.
ఇదిలా ఉండగా గతంలో కొందరు వైసీపీ నేతలు చేసిన ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి. తిరుమలకు చెందిన వైసీపీ నాయకుడు భీమవరపు నాగరాజు రెడ్డి అలియాస్ మందల నాగరాజు రెడ్డి చేసిన అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి.
తిరుమలలో మద్యం బాటిల్‌తో ఉండడం, అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరుమలలో పోలింగ్ బూత్ వద్ద వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై తిరుమలకు చెందిన కొందరు అతనిపై జిల్లా పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అతడి అరాచకాలపైనా తిరుమల టీటీడీ విజిలెన్స్ విభాగం పరిశీలన చేస్తోంది.