BigTV English

Janasena: నాగబాబు సీటుపై జనసేన క్లారిటీ

Janasena: నాగబాబు సీటుపై జనసేన క్లారిటీ

Janasena: ఎట్టకేలకు జనసేన నేత నాగబాబు సీటుపై క్లారిటీ ఇచ్చేసింది ఆ పార్టీ. ఆయన్ని ఎమ్మెల్సీగా ఖరారు చేసినట్టు ఆ పార్టీ తెలిపింది. నామినేషన్‌కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ వెల్లడించింది. ఇంతకీ నాగబాబుకు ఎలాంటి మంత్రి పదవి ఇవ్వనున్నారు? అనేది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ మొదలైంది.


ఏపీ రాజకీయాల్లో నేతల మాటల కంటే పుకార్లు విపరీతంగా షికార్లు చేస్తున్నాయి. పార్టీకి చెందిన నేతలు లీకులు ఇస్తున్నారా? లేక వైసీపీకి చెందినవారు వాటిని క్రియేట్ చేస్తున్నారా? అనేది మాత్రం తెలీదు. నిజం తెలుసు కునే లోపు అబద్దం గుమ్మం దాటి పోతోంది. ఈ సామెత నాగబాబు విషయంలో నిజమైంది.

నాగబాబు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో అనేక ట్విస్టుల ట్విస్టుల వస్తున్నాయి. నాగబాబును కేబినెట్‌లోకి తీసుకుంటున్నామని మూడు నెలల కిందట టీడీపీ హైకమాండ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అధినేత చంద్రబాబు సంతకంతో ఆ నోట్ రిలీజ్ అయ్యింది. అప్పటి వరకు నాగబాబు మంత్రివర్గంలోకి ఎలా వస్తారు? ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని  ఇటు టీడీపీ అటు జనసేనలో లేదు. అప్పుడే దీనిపై రకరకాలుగా చర్చ జరిగింది.


ఎమ్మెల్యే కానీ వ్యక్తిని కేబినెట్‌లోకి ఎలా తీసుకుంటారు? పవన్ సోదరుడు కావడంతో మంత్రి చేస్తారా? ఇలాంటి ప్రశ్నలు వైసీపీ, జనసేన, టీడీపీలోని ఓ వర్గం నుంచి రైజ్ అయ్యాయి. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ విషయాన్ని ప్రస్తావించారు. తాను కుటుంబ రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన వీడియోలను వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేసింది.

ALSO READ: డిప్యూటీ సీఎం కంటే జగన్‌కు ఎక్కువ, మంత్రి లోకేష్ క్లారిటీ

నాగబాబు కేబినెట్‌లోకి తీసుకుంటున్నారని వార్త రాగానే విమర్శనాత్మమైన చర్చ జరిగింది. జనసేనలో కాపు సామాజికవర్గానికి చెందిన పవన్, దుర్గేష్ మంత్రులుగా ఉన్నారు. మళ్లీ నాగబాబు కేబినెట్‌లో తీసుకొస్తే.. గెలిచిన 21 మంది ఎమ్మెల్సీలను కాదని సోదరుడికి ఎలా మంత్రి పదవి ఇస్తారని జనసేనలోని ఓ వర్గం ప్రశ్న లేవనెత్తింది. బీసీలు లేదా ఎస్పీ, ఎస్టీలను మంత్రిగా చేస్తే బాగుండేదన్న వాదన సైతం లేకపోలేదు.

ఈ వివాదం కొనసాగుతుండగానే గతంలో నాగబాబు.. టీడీపీ నేతలపై చేసిన కామెంట్స్ వీడియోను వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసింది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ వెనక్కితగ్గారనే వాదన సైతం లేకపోలేదు. నాగబాబు ఇష్యూని వైసీపీ వేరే లైన్‌లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.

నాగబాబు గురించి జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో జనసేన పార్టీ కొన్ని లీకులు ఇచ్చిందని అంటున్నారు. మంగళవారం సాయంత్రం మీడియా ప్రతినిధులు జనసేన ఆఫీసుకు వెళ్లినప్పుడు ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. సోదరుడు నాగబాబుని రాజ్యసభకు పంపిస్తే హుందాగా ఉంటుందని భావించారట పవన్ కల్యాణ్.

రెండు రోజుల కిందట సీఎం చంద్రబాబు-డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ అసెంబ్లీ ఛాంబర్‌లో దాదాపు గంటపాటు సమావేశం జరిగింది. నాగబాబుని రాజ్యసభకు పంపిద్దామని పవన్.. సీఎం చంద్రబాబుతో అన్నట్లు, ఆయన సరేనని చెప్పడం అనేది ఆ పార్టీ ఆఫీసు నుంచే లీకు వచ్చింది. జనసేనలోని ఓ వర్గం ఈ తరహా ప్రచారం చేస్తోందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. మొత్తానికి జరుగుతున్న పరిణామాలపై అధినేత పవన్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

 

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×