BigTV English

Thandel : ‘తండేల్’ నుంచి రొమాంటిక్ ట్రీట్… ‘బుజ్జితల్లి’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసిందోచ్

Thandel : ‘తండేల్’ నుంచి రొమాంటిక్ ట్రీట్… ‘బుజ్జితల్లి’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసిందోచ్

Thandel : అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన రొమాంటిక్ సర్వైవల్ థ్రిల్లర్ ‘తండేల్’ (Thandel). చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ 2025 ఫిబ్రవరి 7న థియేటర్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మూవీ రిలీజ్ కు ముందే, ప్రమోషన్లలో భాగంగా రిలీజ్ అయిన మెలోడీ ‘బుజ్జి తల్లి’ ఇన్స్టంట్ హిట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేసి అక్కినేని అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చారు మేకర్స్.


బుజ్జితల్లి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్  

సాయి పల్లవి, నాగచైతన్య మధ్య మూవీలో సాగే ఎమోషనల్ జర్నీ కళ్ళకు కట్టేలా ‘బుజ్జి తల్లి’ పాట అద్భుతంగా చూపించింది. ప్రియురాలికి దూరమైన ప్రియుడు విరహ వేదనతో ఆమెను బుజ్జగించేలా పాడే ఈ పాట మూవీ లవర్స్ ను బాగా ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన వీడియో సాంగ్ లో బుజ్జితల్లి తండేల్ రాజాకు దూరం కావడం, ఇద్దరి మధ్య చిన్న మనస్పర్థలు రావడం, కావాలనే బుజ్జితల్లి అతడిని దూరం పెట్టడం వంటి సీన్లు ఆకట్టుకుంటున్నాయి. పైగా తండేల్ రజా సముద్రంలో చేపల వేటకు వెళ్ళినా బుజ్జితల్లి గురించే తల్లడిల్లడం, అతడిపై అలిగినప్పటికీ బుజ్జితల్లి తండేల్ రాజా కోసం ఎదురు చూడడం వంటి సీన్స్ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి.


దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించగా, శ్రీమణి ‘బుజ్జితల్లి’ పాటకు లిరిక్స్ అందించారు. బాలీవుడ్ సింగర్ జావేద్ అలీ ఈ పాటతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడానికి ఒక రకంగా ఈ పాట కూడా కారణం అని చెప్పాలి. ఇలాంటి అద్భుతమైన పాటకు సంబంధించిన ఫుల్ వీడియో సాంగ్ తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు.

25 రోజుల్లో భారీ కలెక్షన్స్ 

కాగా మరోవైపు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్సలెంట్ కలెక్షన్స్ తో ఊర మాస్ ర్యాంపేజ్ చూపెడుతోంది నాగ చైతన్య ‘తండేల్’ మూవీ. లాంగ్ రన్ లో కూడా ఏ మాత్రం తగ్గకుండా మంచి కలెక్షన్లు రాబడుతుంది. ఈ మూవీ రిలీజ్ అయ్యి, ఇప్పటికే 25 రోజులు పూర్తయిన సంగతి తెలిసిందే. 25వ రోజు ఈ సినిమా 5 లక్షల షేర్, 15 లక్షల గ్రాస్ అందుకుంది. టోటల్ గా ప్రపంచవ్యాప్తంగా 25 రోజుల్లో ఈ మూవీ 53.35 (93.80 గ్రాస్) కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. 38 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ గా దూసుకెళ్తోంది.

ఓటిటిలో తండేలు

ఇక ఇన్ని రోజులు థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది. ‘తండేల్’ మూవీ డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మార్చి 7 నుంచి ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ మూవీ నెట్ ఫిక్స్ లో అందుబాటులో ఉండబోతోంది.

 

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×