Lokesh on Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఎందుకు భయపడుతున్నారు? ఎవరి నుంచైనా ఆయన ముప్పు పొంచి ఉందా? తనకు సెక్యూరిటీ కల్పించలేదని పదే పదే ఎందుకంటున్నారు? కావాలనే అధికార పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న మాదిరిగానే సెక్యూరిటీ ఇవ్వాలన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. అసలు ప్రజాప్రతినిధులకు భద్రత విషయంలో ఏం జరుగుతోంది?
జగన్ భద్రత గురించి
జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చినప్పుడు కొత్త కొత్త అంశాలు తెరపైకి తెస్తున్నారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కేవలం రెండు అంశాలు మాత్రమే తెరపైకి తెచ్చారు. మొన్నటివరకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్‌తోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. రెండోది జగన్ భద్రత. దీనికి గురించి రకరకాలుగా ఆ పార్టీ నేతలు ప్రస్తావించడం హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ నేతలు ఆరోపించినట్టుగా జగన్‌కు ప్రభుత్వం భద్రత తగ్గించిందా? దీనిపై మంత్రి లోకేష్ ఏమన్నారు?
ఏపీ బడ్జెట్ సమావేశాలు ఐదో రోజు మొదలయ్యాయి. శాసన సభ ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభమయ్యా యి. తొలుత స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రతిపక్ష హోదాపై కీలక ప్రకటన చేశారు. ఆ తర్వాత మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. వైసీపీ నేతలు, పత్రిక, టీవీ ఛానెళ్లు ఆరోపించినట్టుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కంటే వైసీపీ అధినేత జగన్‌కే ఎక్కువ భద్రత ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రికి జెడ్ కేటగిరి భద్రత ఉంటే, జగన్‌కు జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉందని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.
ప్రతిపక్షం చేయాల్సిన బాధ్యత చేయకుండా వైసీపీ వ్యవహరిస్తోందన్నారు మంత్రి లోకేష్. బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు గవర్నర్ ప్రత్యేకంగా ఆహ్వానిస్తామని, ఉభయ సభలను ఉద్దేశించి ఆయన స్పీచ్‌ను డస్టర్బ్ చేయడం దారుణమన్నారు. గవర్నర్ స్పీచ్ సమయంలో ఏనాడూ తాము పోడియం వద్దకు రాలేదన్నారు.
ALSO READ: జగన్‌ను క్షమిస్తున్నా.. ప్రతిపక్ష హోదాపై స్పీకర్ కీలక ప్రకటన
తాను అసెంబ్లీలో కొత్త సభ్యునని, రూల్స్ తెలుసుకుంటున్నానని తెలిపారు. గతంలో స్పీకర్‌గా పని చేసిన సభ్యులు ప్రస్తుతం సభలో ఉన్నారని గుర్తు చేశారు. జగన్ ప్రతిపక్ష హోదాపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉన్నప్పుడు అప్పటి సీఎం జగన్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించారాయన.
టీడీపీకి 23 మంది సభ్యులు ఉన్నారని, ఐదుగుర్ని లాగేస్తే ప్రతిపక్ష హోదా ఉందని జగన్ చెప్పారని గుర్తు చేశారు మంత్రి లోకేష్. దొంగ పేపర్, ఛానెల్ వినియోగించుకుని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎవరు ఎక్కడ కూర్చోవాలో ప్రజలు నిర్ణయిస్తారని, ప్రజా తీర్పుని గౌరవించి ప్రజలపై పోరాడాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు.
గడిచిన తొమ్మిది నెలల్లో హోదా, భద్రత గురించి మాత్రమే ప్రస్తావించింది వైసీపీ. ప్రజా సమస్యలను మాత్రం గాలి కొదిలేసింది. ఆ విషయం ఆ పార్టీ నేతలకు సైతం తెలుసు. చివరకు ఆ పార్టీ సభ్యులు సైతం సభలో మాట్లాడాలని ఉన్నా, అధినేత ఆదేశాలతో సైలంట్ అయిపోతున్నారు. రేపటి రోజున వైసీపీ మళ్లీ తెరపైకి ఎలాంటి విషయాన్ని తెస్తుందో చూడాలి.
ప్రతిపక్ష హోదాపై అసెంబ్లీలో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
డిప్యూటీ సీఎం కంటే జగన్ కే ఎక్కువ భద్రత ఉంది
ఉపముఖ్యమంత్రికి Z కేటగిరి భద్రత ఉంటే.. జగన్ కు Z+ కేటగిరి సెక్యూరిటీ ఉంది
ప్రతిపక్ష హోదాపై లోక్‌సభ రూల్స్ లో క్లియర్ గా ఉంది
గతంలో జగన్ కూడా ప్రతిపక్ష హోదాపై క్లారిటీ ఇచ్చారు… pic.twitter.com/JkhEbxBR5B
— BIG TV Breaking News (@bigtvtelugu) March 5, 2025