BigTV English

Dilraju: పైరసీపై ఉద్యమం… నేను లీడ్ చేస్తా… ఎఫ్‌డిసి చైర్మన్ దిల్ రాజు కామెంట్స్ వైరల్..!

Dilraju: పైరసీపై ఉద్యమం… నేను లీడ్ చేస్తా… ఎఫ్‌డిసి చైర్మన్ దిల్ రాజు కామెంట్స్ వైరల్..!

Dilraju: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత, ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు (Dilraju) పైరసీకి అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమయ్యారు. ఇక అందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ.. “పైరసీ పై ఎవరి సినిమా ఎఫెక్ట్ అయితే వారే మాట్లాడుతారు. కానీ అది శుక్రవారం మాట్లాడితే.. సోమవారానికి అంతా మర్చిపోతున్నారు. మళ్లీ ఇంకో సినిమా పైరసీ బారిన పడుతుంది. ఈ పైరసీల వల్ల నిర్మాతలందరూ నష్టపోతున్నారు. ఇక దీనికి అడ్డుకట్ట వేయాలి అంటే ఒక ఉద్యమం కావాలి.ఎఫ్డిసి చైర్మన్గా నేను లీడ్ చేస్తాను. నిర్మాతలు అందరూ కలిసి రావాలి. డబ్బులు పోయేవి నిర్మాతలవే కదా.. అందరూ మేల్కోవాలి. ఒక నిర్మాతలే కాదు అండర్ ప్రొడక్షన్ లో ఉన్న వారు కూడా ముందుకు రావాలి. అప్పుడే ఈ పైరసీకి అడ్డుకట్ట వేయగలము” అంటూ దిల్ రాజు పిలుపునిచ్చారు. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.వాస్తవానికి ఇండస్ట్రీలో ఈ పైరసీ ఎంత పెద్ద భూతం గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వందల కోట్ల బడ్జెట్ పెట్టి తీసిన చిత్రాలకి కూడా లీకులు తప్పడం లేదు.. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు నష్టపోకూడదని, ఒక తోటి నిర్మాతగా.. ఎఫ్డిసి చైర్మన్గా తన వంతు ముందుకు అడుగు వేశారు దిల్ రాజు. మరి ఈ ఉద్యమం తో నైనా పైరసీ ఆగుతుందేమో చూడాలి.


కఠిన చర్యలు తప్పవు..

ఇదిలా ఉండగా గతంలో పలు పెద్ద పెద్ద చిత్రాలకు సంబంధించిన పలు అంశాలు సోషల్ మీడియాలో లీకై.. తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే ఈ లీకుల ప్రభావం సినిమా ఫలితంపై, అలాగే వచ్చే కలెక్షన్లపై కూడా పడుతుంది. అందుకే చాలామంది ఈ విషయంపై చర్చించారు కూడా ఆఖరికి ఇటీవల వచ్చిన ‘తండేల్’ సినిమాని కూడా బస్సులలో ప్రసారం చేయడంతో తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు హెచ్చరించారు. అనుమతి లేకుండా కొత్త సినిమాలను ప్రైవేట్ ప్రజా రవాణా వాహనాలు , లోకల్ కేబుల్ ఛానల్స్ లో ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒక ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నట్లు సమాచారం.


గతంలో మంచు లక్ష్మితో కలిసి యాంటీ పైరసీ కార్యక్రమం..

ఇదిలా ఉండగా ఈ పైరసీ సినిమాలకే కాదు ఒరిజినల్ మ్యూజిక్ కి కూడా ఇబ్బందిగా మారిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే గతంలో మ్యూజిక్ పైరసీకి సంబంధించి కూడా దిల్ రాజు ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.మ్యూజిక్ పైరసీకి వ్యతిరేకంగా సాగే యాంటీ పైరసీ కార్యక్రమాన్ని ఆయన మంచు లక్ష్మి (Manchu Lakshmi) తో కలిసి 2012 ఏప్రిల్ 27న ప్రారంభించారు. బిగ్ ఎఫ్ఎం ఆన్లైన్ మ్యూజిక్ పోర్టల్ రాగా వెబ్సైట్, భారతి సిమెంట్, ప్రసాద్ ఐమాక్స్ తదితర సంస్థలు ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించాయి. పలువురు మాట్లాడుతూ..” మ్యూజిక్ పైరసీని అరికట్టాల్సిన అవసరం ఉందని తెలిపిన వారు.. ఒరిజినల్ మ్యూజిక్ ను గెలిపించాలని, లైఫ్ అందించాలనే నినాదంతోనే ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక ప్రసాద్ ఐమాక్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంచు లక్ష్మి , దిల్ రాజు తో పాటు సింగర్ హేమచంద్ర ((Hemachandra) కూడా పాల్గొన్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×