Riyan Parag: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఆ జట్టుకు కొత్త కెప్టెన్ {Riyan Parag} ఎవరో అధికారిక ప్రకటన చేసింది. యంగ్ క్రికెటర్ రియాన్ పరాగ్ కి సారథ్య బాధ్యతలు అప్పగించింది. అయితే ఈ సీజన్ మొత్తానికి అతడే కెప్టెన్ అనుకుంటే పొరపాటే. కేవలం కొన్ని మ్యాచ్ ల వరకు రియాన్ పరాగ్ సారాధ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. మొదటి మూడు మ్యాచ్ లకి కెప్టెన్ గా రియాన్ పరాగ్ ని ఎంచుకుంది రాజస్థాన్ రాయల్స్.
Also Read: IPL 2025: చీర్ లీడర్లకు ఒక్కో మ్యాచ్ కు ఎంత ఇస్తారో తెలుసా ?
ఇందుకు కారణం కొన్ని రోజుల క్రితం గాయపడిన సంజూ శాంసన్.. ఇంకా బీసీసీఐ నుండి పూర్తి క్లియరెన్స్ సాధించకపోవడమె. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన టి-20 సిరీస్ లో గాయపడ్డాడు సంజు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరిగిన ఐదవ టి-20 మ్యాచ్ సందర్భంగా.. ఇంగ్లాండ్ బౌలర్ జో్ఫ్రా ఆర్చర్ వేసిన బంతి సంజు శాంసన్ చూపుడు వేలికి బలంగా తాకింది. ఈ నేపథ్యంలో అతడు ఇటీవలే తన వేలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.
ఈ క్రమంలో సంజూ ఐపీఎల్ 2025 సీజన్ లో మొదటి మూడు మ్యాచ్లకి కేవలం బ్యాటర్ గానే అందుబాటులో ఉంటాడు. సంజు వికెట్ కీపింగ్, ఫీల్డింగ్ చేసేందుకు జాతీయ క్రీక్ అకాడమీ {ఎన్సీఏ} నుంచి క్లియరెన్స్ రాలేదు. దీంతో అతడిని ఓపెనింగ్ బ్యాటర్ గా, కంకషన్ సబిస్టిట్యూడ్ గా వాడబోతోంది రాజస్థాన్ రాయల్స్. బీసీసీఐ నుండి క్లియరెన్స్ వచ్చిన తర్వాత సంజు తిరిగి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు.
ఇక దేశవాళీ టోర్నీలో అస్సాం జట్టుకి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రియాన్ పరాగ్ కి ఇది చాలా పెద్ద బాధ్యత. ఐపీఎల్ 2025 మెగా వేళానికి ముందు రియాన్ పరాగ్ ని రాజస్థాన్ రాయల్స్ 14 కోట్లకు రిటైన్ చేసుకుంది. గత ఐపీఎల్ సీజన్ లో రియాన్ పరాగ్ 15 మ్యాచ్లలో 52.09 సగటుతో 573 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్ 2025 మెగా వేలంలో జోస్ బట్లర్ ని వదిలేయడంతో రాజస్థాన్ జట్టులో సీనియర్ ఆటగాళ్లకు కొరత ఏర్పడింది.
హిట్ మేయర్ ఉన్నప్పటికీ కెప్టెన్ గా సక్సెస్ అవుతాడో లేదో తెలియదు. మరోవైపు యశస్వి జైస్వాల్ కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారని అనుకున్నప్పటికీ.. గత సీజన్ లో అదరగొట్టిన రియాన్ పరాగ్ కి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. ఈ సీజన్ లోని ఆరంభ మ్యాచ్ ని రాజస్థాన్ రాయల్స్ మార్చి 23న సన్రైజర్స్ హైదరాబాద్ తో తలపడబోతోంది. ఇక రెండవ మ్యాచ్ మార్చి 26న కలకత్తా నైట్ రైడర్స్ తో, మూడవ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ తో మార్చ్ 30న గౌహతి వేదికగా ఆడబోతోంది. ఈ మూడు మ్యాచ్లకు రియాన్ పరాగ్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు.
🚨 Riyan Parag is set to captain Rajasthan Royals in their first three matches of IPL 2025. Sanju Samson will play as an impact player in the initial matches.#RiyanParag #SanjuSamson #IPL #IPL2025 #RajasthanRoyals #CricketTwitter pic.twitter.com/MgwcoePTDs
— InsideSport (@InsideSportIND) March 20, 2025