Janasena on Allu Arjun: ఇంట గెలిచి.. రచ్చ గెలవాలి తరచూ పెద్దలు చెప్పే సామెత. చాలామంది ఇంట గెలుస్తారు.. బయట ఓడిపోతారు. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో అదే జరుగుతుందా? మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పకుంటే పుష్ప2 మూవీని అడ్డుకుంటామని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు జనసేన నేత.
పుష్ఫ 2 మూవీ విడుదలకు కొద్దిగంటలకు ముందు జనసేన నుంచి స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చింది. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పకపోతే పుష్ప 2 సినిమాను అడ్డుకుంటామన్నది అందులోని సారాంశం. మెగా ఫ్యామిలీని యావత్ ప్రపంచమే ఇష్ట పడుతుందని, నువ్వు ఒక్కడివే వారికి వ్యతిరేకంగా ఉంటున్నావని మండిపడ్డారు గన్నవరం జనసేన నేత చలమలశెట్టి రమేష్ బాబు.
కొద్దిరోజులుగా అల్లు అర్జున్ వ్యవహారశైలి.. జన సైనికులు, మెగా ఫ్యామిలీకి చాలా బాధ కలిగించిందన్నారు. విపక్ష నేతలు మాట్లాడితే పట్టించుకోమన్నారు. తాను మెగా ఫ్యామిలీ అభిమాని అని, ఆ కాంపౌండ్‌లో పెరిగానని చెప్పిన నీవు.. ప్రస్తుతం చేస్తున్నదేమిటని ప్రశ్నించారు.
మెగాస్టార్ చిరంజీవి అడుగు జాడలో నడుస్తానని చెప్పిన బన్నీ, మాట మార్చడంపై కాసింత రుసరుసలాడారు. మెగా ఫ్యామిలీకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక అభిమానం ఉందన్నారు. మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మొన్నటి ఎన్నికల్లో పని చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALSO READ: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. స్వామిని దర్శించుకుంటే చాలు.. అడిగినన్నీ లడ్డూలు
మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పకుంటే పుష్ప2 అడ్డుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చలమలశెట్టి రమేష్ బాబు. ఒక్కసారి వెనక్కి వెళ్తే.. 2024 ఎన్నికల్లో నంద్యాల నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన రవిచంద్ర కిషోర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు అల్లుఅర్జున్.
కూటమి వేవ్‌లో రవిచంద్ర ఓటమి పాలయ్యారు. ఈ వ్యవహారంపై అప్పట్లో తీవ్రదుమారం రేగింది. అల్లు-మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలున్నాయంటూ వార్తలు జోరందుకున్నాయి. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ బరిలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంలో నిమగ్నమయ్యారు.
మెగా ఫ్యామిలీకి చెందినవారంతా పిఠాపురంలో క్యాంపెయిన్ చేశారు. కానీ అల్లు అర్జున్ మాత్రం దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోయారు. పవన్ కల్యాణ్ అవేమీ పట్టించుకోలేదు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. అప్పటి నుంచి జనసేన కార్యకర్తలు ఏదో విధంగా బన్నీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
ఓ సందర్భంలో బెంగుళూరు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు హీరోలు అడవులను కాపాడేలా సినిమాలు చేసేవారని, ఇప్పుడు అడవులను దోచుకు పోయేలా సినిమాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆనాటి నుంచి అల్లు- మెగా మధ్య మాటల యుద్ధం ముదురుతూనే ఉన్న విషయం తెల్సిందే. ఈ వ్యవహారానికి ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందో చూడాలి.
అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పకపోతే పుష్ప-2 సినిమాను అడ్డుకుంటాం : జనసేన నేత రమేష్
మెగా ఫ్యామిలీని యావత్ ప్రపంచమే ఇష్టపడుతుంది
నువ్వు ఒక్కడివే ఒళ్లు కొవ్వెక్కి వారికి వ్యతిరేకంగా ఉంటున్నావు
ఇప్పటికైనా చిరంజీవి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకో
లేదంటే పుష్ప-2… pic.twitter.com/ed6KP5AkKQ
— BIG TV Breaking News (@bigtvtelugu) December 4, 2024