BigTV English

RGV on Pushpa 2 : పాన్ ఇండియా మూవీని ఇడ్లీతో పోల్చాడు… వర్మ మరీ దారుణమయ్యా ఇది

RGV on Pushpa 2 : పాన్ ఇండియా మూవీని ఇడ్లీతో పోల్చాడు… వర్మ మరీ దారుణమయ్యా ఇది

RGV on Pushpa 2 : ప్రస్తుతం ఎక్కడ చూసినా “పుష్ప 2” ఫీవర్ కనిపిస్తోంది. డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ ఈరోజే స్క్రీనింగ్ కానున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా “పుష్ప 2” (Pushpa 2) మూవీకి పెరిగిన టికెట్ ధరలు సామాన్య ప్రేక్షకుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకు భారీగా టికెట్ రేట్లను పెంచడం అనేది చర్చనీయాంశంగా మారింది. దీని గురించి సినిమా పెద్దలు ఎవ్వరూ నోరు మెదపకపోయినా, ఫ్యామిలీ అంతా కలిసి సినిమాను చూడాలనుకున్న సామాన్యుడు మాత్రం లబోదిబోమంటున్నాడు. ఈ నేపథ్యంలోనే రాం గోపాల్ వర్మ (Ram Gopam Varma) ‘పుష్ప 2’ మూవీని ఇడ్లీతో పోలుస్తూ షాకింగ్ పోస్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ‘పుష్ప 2’ సినిమా టికెట్ రేట్ల గురించి వర్మ చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందులో వర్మ చేసిన ఆ కామెంట్స్ ఏంటో చూసేద్దాం పదండి.


“పుష్ప 2 ఇడ్లీలు #Pushpa2

సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి , ప్లేట్ ఇడ్లీల ధరను రూ. 1000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం, వాడి ఇడ్లీలు మిగతావాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు.


కానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు సుబ్బారావు హోటల్‌కు వెళ్లడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప, ఇంకెవ్వరూ కాదు.

“సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజల అందుబాటులో లేదు” అని ఎవరైనా ఏడిస్తే , అది “సెవెన్‌స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదు” అని ఏడ్చినంత వెర్రితనం

ఒకవేళ “సెవెన్‌స్టార్ హోటల్‌లో అంబియన్స్‌కి మనం ధర చెల్లిస్తున్నాం” అని వాదిస్తే, పుష్ప 2 విషయంలో ఆ సెవెన్‌స్టార్ క్వాలిటీ అనేది ఆ సినిమాఏ

డెమొక్రాటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీదే పని చేస్తుంది. అన్ని ప్రొడక్ట్స్ లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయి, అంతే కానీ ప్రజా సేవ కోసం కాదు.

అప్పుడు లగ్జరీ కార్లపై, విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారు ?

ఎంటర్టైన్మెంట్ నిత్యావసరమా?

ఇల్లు, తిండి, బట్టలు ఈ మూడింటి కన్నా ఎక్కువ అవసరమా?

అలా అయితే ఈ మూడు నిత్యావసరాల ధరలు బ్రాండింగ్ వున్నప్పుడు , ఆకాశాన్ని తాకుతుంటే, ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే. అలా అనుకోని వారు చూడటం మానెయ్యొచ్చూ, లేదా తర్వాత రేట్లు తగ్గాక చూసుకోవచ్చు కదా?

మళ్లీ సుబ్బారావు హోటల్ చైన్ విషయం కొస్తే ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయింది.. దానికి ప్రూఫ్ ఏమిటంటే సుబ్బా రావు ఏ హోటల్లో కూడా కూర్చునే చోటు దొరకడం లేదు, అన్ని సీట్లు బుక్ అయిపోయాయి!” అంటూ సుధీర్ఘ పోస్ట్ చేశారు రామ్ గోపాల్ వర్మ.

ఎంటర్టైన్మెంట్ చాలా కాస్ట్ లీ గురూ

ఈ పోస్ట్ ఓ వర్మ ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాకు పెంచిన ఈ రేట్లు తక్కువే అంటున్నారు. కానీ పాన్ ఇండియా పేరుతో కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలు తీసి, వాటిని తిరిగి రాబట్టుకోవడానికి ప్రేక్షకులపై భారాన్ని మోపడం ఎంత వరకు కరెక్ట్ అనేది ప్రేక్షకుడి ప్రశ్న. లగ్జరీ కార్లపై, విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు అంటూ వర్మ (Ram Gopal Varma) ఎవరిని టార్గెట్ చేశారు అనే విషయాన్ని పక్కన పెడితే… సినిమా అనేది ఇప్పుడు అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ లాంటిది. కుటుంబ సమేతంగా చూడాలని ఆశపడతారు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా పేరుతో ఇంతింత రేట్లు పెట్టి, సామాన్యుడికి ‘ఎంటర్టైన్మెంట్ చాలా కాస్ట్ లీ గురూ’ అన్పించేలా చేస్తున్నారు. ఇక ఎవరి వాదన ఎలా ఉన్నా సరే పుష్ప రాజ్ క్రేజ్ కు రికార్డులైతే బద్దలవ్వడం ఖాయం అన్పిస్తోంది. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టుగా… ఒకవైపు మూవీ టికెట్ రేట్లు ఆకాశాన్ని తాకాయి అంటున్న అదే ప్రేక్షకులు మూవీని చూడడానికి మరింత ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తుండడం గమనార్హం. మరి ఈ టికెట్ రేట్ల వాదన ఎఫెక్ట్ సినిమాపై ఎంత మేరకు పడుతుందో తెలియాలంటే మూవీ రిలీజ్ అయ్యాక వచ్చే కలెక్షన్ లను బట్టి తేలుతుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×