JC Prabhakar Reddy: టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వార్తల్లోకి వచ్చేశారు. ఈసారి తాడిపత్రి ప్రజలకు డెడ్‌లైన్ విధించారు. ఇంతకీ ప్రభాకర్‌రెడ్డి డెడ్‌లైన్ ఏంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్దాం.
తాడిపత్రి మున్సిపాలిటీలో ఎక్కడపడితే అక్కడ చెత్త దర్శనమిస్తోంది. దీనిపై అధికారులు ఎంత చెప్పినా షరా మామూలే. చెప్పినట్టు వినడం, ఆ తర్వాత మామూలుగా వ్యవహరించడం అక్కడి ప్రజల వంతైంది. దీనిపై అధికారులు నేరుగా ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డికి తెలిపారు. దీంతో ఆయన లైన్‌లోకి వచ్చారు.
శుక్రవారం ఉదయం తన ఇంట్లో మీడియా మాట్లాడారు తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి. ఈ క్రమంలో సంచలన కామెంట్స్ చేశారు. తాడిపత్రి పట్టణ ప్రజలకు డెడ్ లైన్ విధించారు. ఈ క్రమంలో పట్టణ ప్రజలకు నాలుగు ఆప్షన్లు ఇచ్చారాయన.
పట్టణంలో ఎవరైనా చెత్త వేస్తే నీళ్లు కట్ చేస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు కరెంటు కట్ చేస్తామన్నది రెండో ఆప్షన్. చివరగా పెనాల్టీ వేయడమేకాదు.. చెత్తను తీసుకొచ్చి సరాసరి మీ ఇంట్లోనే వేస్తామన్నారు. ఊరు బాగుంటే అందరం బాగుంటామన్నది ఆయన కాన్సెప్ట్. కానీ ప్రజల తీరు ఏ మాత్రం మారలేదు.
ALSO READ: అవినాష్‌కు మరో గండం.. ఈసారి వివేకా హత్య కేసులో కాదు, ఆయన పీఏ రాఘవరెడ్డి దొరికితే?
దీంతో తమ మనసులోని ఆవేదనను బయటపెట్టారాయన జేసీ ప్రభాకర్‌రెడ్డి. మీరు మారుతారా? లేకుంటే తాడిపత్రి నుండి నన్ను తరిమికొట్టండంటూ వ్యాఖ్యానించారు. చివరకు వాహనాలు సైతం సరిగా పెట్టలేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నన్ను తాడిపత్రి నుంచి తరిమేయండి: జేసీ ప్రభాకర్ రెడ్డి
పట్టణ ప్రజలు ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తే కఠిన చర్యలు
నీళ్లు, కరెంటు కట్ చేస్తా, పెనాల్టీ వేస్తా, చివరగా మీరు వేసిన చెత్త మీ ఇంట్లోనే వేస్తా
మీరు మారుతారా? లేదంటే నన్నే ఊరి నుంచి తరిమేయండి
– జేసీ ప్రభాకర్ రెడ్డి@JCPRTDP… pic.twitter.com/8t7sS3Ci41
— BIG TV Breaking News (@bigtvtelugu) November 15, 2024