BigTV English

JC Prabhakar Reddy Vs Pedda Reddy: పెద్దారెడ్డితో నాకు ప్రాణహాని ఉంది: జేసీ ప్రభాకర్ రెడ్డి

JC Prabhakar Reddy Vs Pedda Reddy: పెద్దారెడ్డితో నాకు ప్రాణహాని ఉంది: జేసీ ప్రభాకర్ రెడ్డి

JC Prabhakar Reddy Vs Pedda Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి, అనంతపురం నుంచి కాదు.. మొత్తం ఏపీ నుంచే బహిష్కరించాలన్నారు. పెద్దారెడ్డితోపాటు ఆయన ఇద్దరు కుమారులను కూడా బహిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేతిరెడ్డి తాడిపత్రికి వస్తే పంచె ఊడదీసి కొడతానంటూ హెచ్చరించారు.


అయితే, తనకు తాడిపత్రిలో శత్రువులే లేరన్న ప్రభాకర్ రెడ్డి.. వైసీపీలో నలుగురైదుగురు ఉన్నారని తెలిపారు. వాళ్లపై చట్టపరంగానే చర్యలకు వెళ్తానన్నారు. తాడిపత్రిలో ఉండడానికి తనకు పోలీసుల పర్మిషన్ అవసరం లేదన్నారు. ‘నేనే పోలీసులకు సమాచారం ఇస్తాను.. అప్పుడు రక్షణ కల్పించండి.. తాడిపత్రి అల్లర్ల కేసులో నన్ను అరెస్ట్ చేసుకోండి’ అంటూ వ్యాఖ్యానించారు. పెద్దారెడ్డి జీవితం మొత్తం గన్ మెన్ లతోనే సాగిందన్నారు. పోలింగ్ రోజు కూడా కేతిరెడ్డి తమ కార్యకర్త ఇంటిపై దాడి చేశారని ఆయన అన్నారు.

Also Read: ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి: సీఎం జగన్ డిమాండ్


అదేవిధంగా తన ట్రావెల్స్, తనపై పెట్టిన అక్రమ కేసులకు సంబంధించి డీటీసీ, ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై ఈ నెల 24 (జులై 24)న అనంతపురం వన్ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. పేర్ని నాని, ఓ ఐపీఎస్ అధికారి, డీటీసీలపై ఫిర్యాదు చేస్తానంటూ చెప్పారు. న్యాయం జరిగేవరకు తాను ఆ పోలీస్ స్టేషన్ నుంచి కదలబోనంటూ స్పష్టం చేశారు.

 

Tags

Related News

Tirupati crime: బిడ్డ భారమనుకున్న తల్లి.. మురికి కాలువలో విసిరేసింది!

Leopard attack: చిరుత పులి వచ్చింది.. కోడిని వేటాడి వెళ్లింది.. ఏపీలో ఘటన!

AP Liquor Scam: మిథున్ రెడ్డికి బెయిల్.. రిలీజ్ ఎప్పుడంటే..?

Jagan To Assembly: అసెంబ్లీకి వద్దులే.. సింపతీ వస్తే చాలులే

Turakapalem Deaths: ఆ గ్రామ ప్రజలు వంట చేసుకోవద్దు.. ఆదేశాలు జారీ చేసిన సీఎం

AP Social Media Posts: మనుషులా..? పశువులా..? రోస్టింగ్ పేరుతో రోత.. సైకో చేష్టల కోత్త చట్టం..!

Big Stories

×