Ap jobs : ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా కోర్టుల్లో వివిధ ఉద్యోగాల కోసం హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. 1520 ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏడో తరగతి లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి: జులై 1, 2022 నాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 11లోపు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ.800, ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్థులు రూ. 400లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. గత కొన్నేళ్లలో కోర్టుల్లో ఇన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. 1520 ఫోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉద్యోగార్ధులు భారీగా దరఖాస్తు చేసే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలకు పోటీ కూడా ఎక్కువగా ఉంటుంది.