Jogi Ramesh counter : పవన్ కల్యాణ్ కు ఏపీ మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు. పవన్ వి పిచ్చి వ్యాఖ్యలని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఇప్పటం గ్రామంలో ఒక్క ఇంటిని కూడా కూల్చలేదని మంత్రి క్లారిటీ ఇచ్చారు. పవన్ వ్యవహార శైలి ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగిరినట్లుందని మంత్రి సెటైర్ వేశారు. ఇప్పటి ఊరు బాగుపడుతోందని గ్రామస్తులంతా ఆనందంగా ఉన్నారని పవన్ ఇక్కడకు వచ్చి హడావుడి చేస్తున్నారని మంత్రి విమర్శించారు.
పవన్ కల్యాణ్ ఈ రోజు ఇప్పటం గ్రామానికి జనసైనికులతో కలిసి వెళ్లారు.. జనసైనికులతో పాటు టీడీపీ సానుభూతిపరులు కూడా ఎక్కువ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇప్పటం గ్రామంలో ఇళ్లను కూల్చి వేసిన స్థలానికి జనసేనాని చేరుకున్నారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.