BigTV English

Jonnalagadda Padmavathi : ఎస్సీలంటే చిన్నచూపెందుకు? .. జగన్ పై మరో దళిత ఎమ్మెల్యే నిరసన గళం..

Jonnalagadda Padmavathi : వైసీపీ ప్రభుత్వం పై సొంత పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు రాకముందు పార్టీకి కీలక నేతలు రాజీనామా చేస్తున్నారు. దీంతో వైసీపీ అధిష్టానం కి తీవ్ర సమస్య గా మారింది. తాజాగా వైసీపీ ప్రభుత్వం తీరుపై , పార్టీ పై అనంతపురం జిల్లా శంగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మంత్రి పెద్దిరెడ్డి పై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి పద్మావతి తన ఫేస్ బుక్ శాతాలో ఓ వీడియో పోస్టు చేశారు. ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజలకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయానని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు తనను క్షమించాలని కోరారు.

Jonnalagadda Padmavathi : ఎస్సీలంటే చిన్నచూపెందుకు? .. జగన్ పై మరో దళిత ఎమ్మెల్యే నిరసన గళం..

Jonnalagadda Padmavathi : వైసీపీ ప్రభుత్వంపై సొంత పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందే పార్టీకి కీలక నేతలు రాజీనామా చేస్తున్నారు. ఇలాంటి పరిణామాలు వైసీపీ అధిష్టానానికి తీవ్ర సమస్య గా మారింది. తాజాగా వైసీపీ ప్రభుత్వం తీరుపై , పార్టీ‌పై అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ వీడియో పోస్టు చేసిన పద్మావతి.. ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజలకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలు తనను క్షమించాలని కోరారు.



తన నియోజకవర్గంలో ప్రజలు తాగునీటి అవసరాలకు తీర్చేందుకు శింగనమల చెరువుకు నీరు తెచ్చుకోవాలంటే యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు ఎమ్మెల్యే. నీటి సమస్య పరిష్కరించాలని ఎన్నిసార్లు అధికారులకు తెలియజేసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా సీఎం ఆఫీసుకు వెళ్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. శింగనమల నియోజకవర్గానికి నీళ్లు తెచ్చుకోవాలంటే యుద్ధం చేయాలా? అని ఆమె ప్రశ్నించారు.

వరదలొస్తేనే నీళ్లు ఇస్తారా? ఎస్సీ నియోజకవర్గమంటే నేతలకు అంత చిన్న చూపా? అని ఎమ్మెల్యే పద్మావతి ప్రశ్నించారు. ఒకే కులాన్ని, ఒకే నియోజకవర్గానికి మాత్రమే అభివృద్ది చేస్తారా అని నిలదీశారు. ప్రశ్నిస్తే నేరంగా భావిస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కోసం ఎన్నేళ్లు ఇలా పోరాటం చేయాలి? అని అన్నారు. ఐదేళ్లలో ఒకసారి నీరు సరఫరా చేస్తే సరిపోతుందా? అని అధికారులపై తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గంలో సమస్యలు తీరాలంటే ప్రజలు అందరూ తనతో వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు.


సీఎం కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్టుగానే నడుచుకుంటున్నారని పద్మావతి విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ కోసం ఆమె స్పందించారు. సీఎం జగన్ మాట తప్పను .. మడమ తిప్పను అని చెప్పి కేవలం పెద్దిరెడ్డి మాట మాత్రమే వింటున్నారని విమర్శించారు. తక్కువ కులం అనే భావనతో తమపై తీవ్ర వివక్షత చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించడం లేదని సీఎం జగన్ తెలిపారని వెల్లడించారు. అయితే టికెట్ ఇవ్వాలన్ని అభ్యర్థించినా.. ఎలాంటి స్పందన లేదని సోషల్ మీడియా ద్వారా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×