Amaravati: సీనియర్ జర్నలిస్టు, విశ్లేషకుడు కృష్ణంరాజు మళ్లీ వార్తల్లోకి వచ్చేశారు. మరోసారి ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఆయనపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది.
ఏపీ రాజధాని అమరావతిపై సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు మళ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. సాక్షి ఛానెల్‌లో తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తాను మాట్లాడిన మాటలకు పక్కగా ఆధారాలు ఉన్నాయంటూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఓ వీడియో విడుదల విడుదల చేశారు.
ఆ వీడియోలో వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రదర్శించారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న కృష్ణంరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎయిడ్స్ వర్కర్లు, దానికి సంబంధించినవారు ఎక్కువగా ఉన్నారన్న విషయం ప్రభుత్వానికి తెలుసన్నారు. 2024 లెక్కల ప్రకారం దేశంలోని ఏపీలో ఆ తరహా వర్కర్ల సంఖ్య తొలి రెండు స్థానాల్లో ఉండవచ్చన్నారు.
ఏపీలో లక్షా 33 వేల మంది ఉన్నట్లు జాతీయ సంస్థలు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు ఆయన. అమరావతి దేవతల రాజధానిగా మనం భావిస్తుండడంతో ఇటువంటి సామాజిక సమస్యలు ఉంటే నిర్మూలించుకోవాలన్న ఉద్దేశంతో చేసిన కామెంట్ దుమారం రేగిందన్నారు.
ALSO READ: అప్పుడు కాపు.. ఇప్పుడు కమ్మ, అరెస్టు అంటే అంబటికి కులాలే గుర్తుకొస్తాయా?
వాటికి సంబంధించి వెబ్‌పోర్టల్ రాసుకొచ్చిన ఐటెంలను చూపించారు. పేపర్లు, వెబ్ సైట్లలో వచ్చిన వార్తలకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదన్నారు. అమరావతి పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పడంతో దుమారం రేగిందన్నారు.
తన వ్యాఖ్యల్లో తప్పు లేదన్నప్పుడు అజ్ఞాతంలోకి కృష్ణంరాజు ఎందుకు వెళ్లారో ఆయనకే తెలియాలి. మరోవైపు జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీవీ డిబేట్ సందర్భంగా అమరావతిలోని మహిళలపై అనుచిత వ్యాఖ్యలను సుమోటాగా స్వీకరించింది జాతీయ మహిళా కమిషన్.
ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నామంటూ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు డీజీపీకి లేఖ రాశారు జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ విజయ రహత్కర్. దీనిపై మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఏపీ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.
అమరావతిపై మరోసారి జర్నలిస్టు కృష్ణంరాజు రెచ్చగొట్టే వ్యాఖ్యలు
తన వ్యాఖ్యలకు ఆధారాలు ఉన్నాయంటూ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియో విడుదల
తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నాలు
వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రదర్శించిన కృష్ణంరాజు
ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న కృష్ణంరాజు pic.twitter.com/yTmbuamq8h
— BIG TV Breaking News (@bigtvtelugu) June 10, 2025