Jamie Lever:అందం, అభినయంతో పాటు అదృష్టం, నటన,ప్రతిభ ఉన్నవారికి ఇండస్ట్రీ ఎప్పుడూ సలాం కొడుతుంది అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు చాలామంది నిరూపిస్తున్నారు. అలా ఇండస్ట్రీలోకి రాగానే వారికి అవకాశాలు వస్తున్నాయా అంటే చెప్పలేని పరిస్థితి. ఆ అవకాశం కోసం ఎన్నో అవమానాలు, చీత్కారాలు, హేళనలు ఇలా ఎన్నో అధిగమించి, ఆ తర్వాత స్టార్ గా అవకాశం అందుకొని తమకు తాము తమ నటనతో, ప్రతిభతో ప్రూవ్ చేసుకొని నేడు స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు. ఇకపోతే అలా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఇప్పుడు ఒక్కొక్కరిగా సోషల్ మీడియా ద్వారా బయటపెడుతుంటే, ఇన్ని కష్టాలు పడ్డారా అంటూ నెటిజన్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
స్టార్ కిడ్స్ కి కూడా తప్పని విమర్శలు..
ఇది ఇదిలా ఉండగా ఇప్పటివరకు చాలామంది హీరోయిన్లు అధిక బరువు కారణంగా సమాజంలో సమస్యలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే వర్ణ, వివక్ష అహంకారంతో కోరుకున్న విమర్శలు కూడా ఎదుర్కొన్నామని గతంలో కొంతమంది తెలిపారు. అలా ఇప్పటికే సారా అలీ ఖాన్(Sara Ali Khan) , సోనాక్షి సిన్హా(Sonakshi Sinha), ఖుషి కపూర్(Khushi Kapoor), సుహానా ఖాన్(Suhana Khan) లాంటి ఎంతోమంది సెలబ్రిటీలకు కూడా ఈ విమర్శలు తప్పలేదు. అయితే ఇప్పుడు ఆ జాబితాలోకి జానీ లివర్ కుమార్తె జేమీ లివర్ కూడా వచ్చి చేరింది. తాను ప్రజల నుంచి ఎదుర్కొన్న సమస్యలను చెప్పుకొచ్చింది.
మరీ నల్లగా ఉన్నావ్.. చచ్చిపో అన్నారు – జేమీ లివర్
ఎదిగే వయసులో తాను చాలా అవమానాలను భరించానని, తన రంగు మరీ నల్లగా ఉందని, అధిక బరువుతో వికారంగా ఉన్నావని చాలామంది విమర్శించారు. నా బరువును కవర్ చేయడానికి నేను వదులుగా ఉండే దుస్తులు ధరించాను. నా తల్లిదండ్రులు కూడా వదులుగా ఉండే దుస్తులు ధరించమని సూచించేవారు. నా అధిక బరువే కాకుండా నా చర్మ రంగు కారణంగా.. వారు చేసే కామెంట్స్ కి నన్ను నేనే అసహ్యించుకునేలా చేసింది. ఇక నేను నల్లగా ఉన్నానని, వికారంగా ఉన్నానని, నవ్వితే మాంత్రికురాలుగా కనిపిస్తానని ఇలా ఎంతోమంది ఎన్నో రకాల అవమానపు కామెంట్లతో ఇబ్బంది పెట్టారు అంటూ చెప్పుకొచ్చింది. కొంతమంది అయితే మరీ ఘోరంగా ఇంత అసహ్యంగా ఉన్నావు.. నువ్వు బ్రతికి ఏం ప్రయోజనం.. చచ్చిపో అని కూడా కోరారు. తెల్లగా, అందంగా ఉంటేనే అవకాశాలు అని కూడా సూచించారు అంటూ ఆమె తెలిపింది.
సమాజంలో మార్పు కోరుకుంటున్న నటి..
అలా ఎన్నో విమర్శలతో విసిగిపోయిన ఈమె, ఈ అధునాతన సమాజంలో డిజిటల్ యుగంలో ఇప్పటికీ ఇలాంటి మనస్సాక్షి లేని వెకిలి మనుషులను చూడాల్సి వస్తోందని తెలిపింది. అంతేకాదు నలుపు, తెలుపు అంటూ జాతి అహంకారం ప్రదర్శించడం ఒక ఘోరమైన ఘటన అని.. కాలక్రమేనా.. సమాజంలో కూడా మార్పులు రావాలి అని కోరుకుంటున్నట్లు జేమీ లివర్ తెలిపింది. మొత్తానికి అయితే తాను పడ్డ ఇబ్బందులను అభిమానులతో చెప్పుకొచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ స్టార్ కిడ్.
ALSO READ:Kannappa film: మంచు వారి కన్నప్ప డిస్ట్రిబ్యూటర్స్ వీళ్లే… చాలా ధైర్యం చేశారు బ్రో మీరు