E-Paper
Advertisement

Indian 2 – Kadharalz Video Song: కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ నుంచి వీడియో సాంగ్ రిలీజ్

Indian 2 – Kadharalz Video Song: కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ నుంచి వీడియో సాంగ్ రిలీజ్
Advertisement

Indian 2 – Kadharalz Video Song: కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాతో మంచి కంబ్యాక్ అందుకున్నాడు. దీంతో తమ అభిమాన హీరో కమల్ హాసన్‌ను ఇంకెవరూ ఆపలేరని అభిమానులు ఫుల్ ఖుష్ అయిపోయారు. ఇక ఈ మూవీ తర్వాత క్రేజీ అండ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో కమల్ హాసన్ ‘ఇండియన్2’ సినిమా అనౌన్స్ చేయడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఫస్ట్ నుంచి ఈ మూవీపై హైప్ ఓ రేంజ్‌లో ఉంది. అంతేకాకుండా దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సుమారు 3 ఏళ్లు సమయం తీసుకున్నాడు.

దీంతో ఈ మూవీని శంకర్ భారీ స్థాయిలో రూపొందిస్తున్నాడంటూ అభిమానులు సంబరపడిపోయారు. అలాగే ఇండియన్ 2 మూవీ రిలీజ్‌కు ముందు అప్డేట్‌లతో సినీ ప్రియుల్ని బాగా ఆకట్టుకుంది. పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ ఇలా ప్రతీ అప్డేట్‌తో బజ్ క్రియేట్ చేశారు. అలా ఎన్నో అంచనాలతో ఈ సినిమాను ఇటీవల థియేటర్లలో రిలీజ్ చేశారు. కానీ స్క్రీన్‌పై బొమ్మ పడేసరికి అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. సినిమా కొందరికి అస్సలు ఎక్కలేదు.

Advertisement

Also Read: కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ ఓటీటీ డీల్ ఫిక్స్.. ఎందులో అంటే..?

దర్శకుడు శంకర్ ఇన్నేళ్లు ఈ సినిమా కోసమా శ్రమించాడు అని గుసగుసలు వినిపించాయి. అంతేకాకుండా ఈ మూవీలో శంకర్ మార్క్ ఎక్కడా కనిపించలేదని కామెంట్లు వినిపించాయి. అయితే కమల్ హాసన్ యాక్టింగ్ సినిమాకి హైలైట్ అని చెప్పుకొచ్చారు. కమల్‌తో పాటు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ సహా ఇతర నటీ నటుల యాక్టింగ్ అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు. కానీ సినిమా మాత్రం పెద్దగా హిట్ టాక్‌ తెచ్చుకోలేకపోయింది.

Advertisement

అయితే ఈ మూవీలో ఉన్న కొన్ని సాంగ్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అందులో ‘కధరాల్జ్’ సాంగ్ ఒకటి. ఈ సాంగ్‌లో సిద్ధార్థ్ తన డాన్స్‌తో ఆకట్టుకున్నాడు. తాజాగా ఈ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా టాక్‌ కమల్ హాసన్‌ను నిరాశ పరిచాయి. దీంతో ఇప్పుడు తన కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ‘థగ్ లైఫ్’పై ఫోకస్ పెట్టాడు. ఈ సినిమాతో ఎలా అయినా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. తాజాగా ఈ మూవీ డబ్బింగ్ పనులు జరుగుతున్నట్లు మేకర్స్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×