BigTV English

Jyothi Yarraji: నెల జీతం 18 వేలే.. కుమార్తె మాత్రం ఆసియా ఛాంపియన్.. జ్యోతి హిస్టరీ ఇదే!

Jyothi Yarraji: నెల జీతం 18 వేలే.. కుమార్తె మాత్రం ఆసియా ఛాంపియన్.. జ్యోతి హిస్టరీ ఇదే!

Jyothi Yarraji: తెలుగు తల్లి భూమి నుంచి వచ్చిన జ్యోతి యర్రాజి పేరు ఇప్పుడు కేవలం క్రీడా రంగంలోనే కాక, ప్రతి తెలుగు ఇంటిలో గర్వానికి చోటు సంపాదించింది. దక్షిణ కొరియాలోని గుమిలో జరిగిన 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం గెలిచి మన దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ విజయంతో జ్యోతి తెలుగు క్రీడా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. అయితే ఈమె విజయం వెనుక కష్టాలు ఒక్కసారి తెలుసుకుంటే, కన్నీళ్ళు రావాల్సిందే. ఇప్పుడేమో యావత్ ప్రపంచం ఈమెను అభినందిస్తోంది. కానీ ఈమె పడ్డ శ్రమ, కుటుంబ స్థితిగతులు తెలుసుకుందాం.


జ్యోతి కుటుంబ నేపథ్యం..
విశాఖపట్నం జిల్లా ఒక సాధారణ కుటుంబంలో జ్యోతి జన్మించారు. ఆమె తండ్రి సెక్యూరిటీ గార్డ్‌గా, తల్లి డోమెస్టిక్ హెల్పర్‌గా పనిచేస్తున్నారు. ఆర్థికంగా పెద్ద స్థాయిలో కాకపోయినా, జ్యోతి తల్లి తండ్రుల త్యాగంతో, పట్టుదలతో ముందుకు సాగింది. చిన్నతనం నుండే క్రీడల పట్ల ఆసక్తి కలిగి, పాఠశాలలో శారీరక విద్య ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో హెర్డిల్స్‌లో శిక్షణ పొందడం ప్రారంభించింది. జ్యోతి ప్రతిరోజూ కఠినమైన వ్యాయామాలతో తన ప్రతిభను మెరుగుపరిచింది.

విజయాలు ఇవే..
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆమె సాధించిన విజయాలు చిరస్థాయిగా నిలిచాయి. 2023లో జరిగిన ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించి, దేశానికి గౌరవాన్ని తెచ్చుకుంది. ఆ తర్వాత తాజాగా జరిగిన  ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో కేవలం 12.96 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.


2023లో జ్యోతి కన్నీటి పర్యంతం
దక్షిణ కొరియాలో 2023లో జరిగిన 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ లో 100 మీటర్ల హర్డిల్స్ పోటీలో పరిగెడుతూ, స్వర్ణం గెలిచిన సందర్భంగా ఆమె చేతిలో పట్టుకున్నప్లకార్డులో ఈ గౌతమ్ మిస్ యూ అనే పదాలు కనిపించాయి. ఆమెకు అత్యంత సన్నిహితుడైన గౌతమ్ అనుకోని పరిస్థితుల్లో కన్నుమూశాడు. ఆ బాధను హృదయంలో పెట్టుకుని, ఆత్మవిశ్వాసంతో పరిగెత్తి విజయం సాధించి, ఆ గెలుపును అతని స్మృతికి అంకితంగా మార్చింది. ఇది కేవలం గెలుపు మాత్రమే కాదు గౌతమ్‌కు ఒక అద్భుత నివాళిగా చెప్పవచ్చు .

తల్లిదండ్రుల ప్రోత్సాహం..
ఈ విజయం తాను సాధించిన కష్టం, తల్లిదండ్రుల ఆశీర్వాదంతోనే సాధ్యమైందని జ్యోతి చెబుతున్నారు. జ్యోతి గురించి తెలియని నిజం ఏమిటంటే, ఆమె క్రీడా ప్రపంచంలో ప్రతీ అడుగులో కూడా తండ్రి సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగంతో జీతం సుమారు రూ.18వేలు పొందుతూ, కుటుంబాన్ని పోషించాఋ. కష్టపడిన తల్లి తండ్రుల బాధ్యతలను గుర్తించి, వారి సంతోషం కోసం ఆమె మరింతగా ప్రయత్నించింది. చివరకు అనుకున్న విజయాన్ని సాధించింది. జ్యోతి సాధించిన ఈ విజయాలు తెలుగు యువతలో, ముఖ్యంగా అమ్మాయిలలో ఒక గొప్ప ప్రేరణగా నిలిచాయి. ఆమె దృఢ సంకల్పం, కష్టపాటుతో సాధించిన విజయాలు తెలియజేస్తున్నాయి. అంతేకాక, జ్యోతి ప్రతిభ దేశవ్యాప్తంగా భారతీయ క్రీడాకారిణులలోనే కాదు, అంతర్జాతీయ వేదికలపై కూడా అద్భుత ప్రతిభ చూపించింది. భవిష్యత్తులో పారిస్ ఒలింపిక్స్, వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ వంటి అగ్ర పోటీలలో కూడా భారతదేశానికి, తెలుగువారికి గౌరవం తెచ్చేలా ప్రయత్నిస్తోంది.

Also Read: Godavari River: గోదావరి చూడాలని ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి!

జ్యోతి సాంకేతికంగా బలమైన ఎథ్లెట్ మాత్రమే కాదు, క్రీడాకారిణి మాత్రమే కాదు, యువతకు ఒక ప్రతీక, ఆత్మవిశ్వాసానికి, కష్టపాటు పట్ల పట్టుదలకు ప్రతీకగా నిలిచింది. చిన్నప్పుడు పేద కుటుంబం నుంచి వచ్చినా, పట్టుదలతో ఎలా ప్రపంచ సత్కారాలు సాధించవచ్చో జ్యోతి చూపించింది. ఇలా ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఓ యువతి, తన పట్టుదలతో, తన తల్లిదండ్రుల ఆత్మవిశ్వాసంతో ప్రపంచస్థాయి క్రీడాకారిణిగా ఎదిగింది. ఈ గాథ ప్రతి తెలుగు యువతి కోసం స్ఫూర్తిగా నిలుస్తుంది. మొత్తానికి, జ్యోతి యర్రాజి ఇప్పుడు కేవలం ఒక క్రీడాకారిణి మాత్రమే కాదు, తెలుగు యువతకు ప్రతిభతో విజయం సాధించే దారిని చూపించిన అగ్రగామిగా నిలిచింది. ఆమె సాధించిన విజయాలు తెలుగు జాతీయ గర్వానికి మించి, దేశీయ క్రీడా రంగానికి గొప్ప పెట్టుబడిగా భావించాలి. భవిష్యత్తులో జ్యోతి మరిన్ని రికార్డులు బద్దలు కొట్టి, మరిన్ని అంతర్జాతీయ మెడల్స్ తెచ్చేలా ప్రయత్నిస్తుందని ఆశించాలి. ఆమె కష్టపాటుతో, దేశ ప్రతిష్ఠను మరింతగా పెంచేందుకు నిరంతరం శ్రమిస్తుందని అందరం కోరుకుంటాం.

సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ అభినందన
దక్షిణ కొరియాలోని గుమిలో జరిగిన 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జ్యోతి యర్రాజి 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించడంతో సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు ట్వీట్ చేసి ప్రత్యేకంగా అభినందించారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప క్రీడాకారిణిగా వారు అభివర్ణించారు.

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×