KA Paul On PM Modi: దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతోంది. భారతీయులకు సంకెళ్లు వేసి దేశానికి అమెరికా పంపించడంపై అన్ని వర్గాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ మరింత ఆగ్రహాంగా ఉంది. దీన్ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు శాంతి దూత, ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్.
ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడారు కేఏ పాల్. రేపిస్టులు, టెర్రరిస్టులు, క్రిమినల్స్ మాదిరిగా భారతీయులను స్వదేశానికి ట్రంప్ సర్కార్ పంపించడంపై మండిపడ్డారు. ఈ విషయంలో ప్రధాని మోదీ ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారాయన. పాలన చేతకాకపోతే ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఆ పదవిలో అమిత్ షాను కూర్చోబెట్టాలని డిమాండ్ చేశారు. భారతీయులు క్రిమినల్సా అంటూ మండిపడ్డారు. తక్షణమే విదేశాంగ మంత్రి జైశంకర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమిత్ షాతో కలిసి తాను పోరాటం చేస్తాన్నారు.
అమెరికాలో బాధితులకు అండగా తాను ఉన్నానంటూ ముందుకొచ్చారు శాంతి దూత, ప్రజాశాంతి పార్టీ చీఫ్. అమెరికాలోని పలువురు సేనెటర్లతో మాట్లాడుతున్నానని చెప్పారు. 54 లక్షల మంది భారతీయుల్లో 8 నుంచి 12 లక్షలు వీసా ఓవర్ స్టేలో అక్రమంగా అక్కడ ఉన్నారని గుర్తు చేశారు. నేరస్తులు, టెర్రరిస్టుల మాదిరిగా మెక్సికో బోర్డర్ క్రాస్ చేసి వాళ్లు వెళ్లలేదన్నారు.
ALSO READ: చంద్రబాబు కేబినెట్ కీలక నిర్ణయం.. ఆ పోస్టులు 34 శాతం వారికే!
బుధవారం అమెరికా నుంచి వచ్చిన విమానంలో దాదాపు 30 మంది గుజరాతీయులు, మిగతావారు పంజాబీలు ఉన్న విషయాన్ని వివరించారు కేఏ పాల్. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ నేతలతో ఒదిగేదేమీ లేదన్నారు. అక్కడి ప్రజలకు ట్రంప్ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకుంటున్నారని చెప్పుకొచ్చారు.
అమెరికాలో అక్రమంగా ఉన్నవారికి పిల్లలు పుడితే ఇల్లీగల్ కాదని, లీగల్ అని చెప్పుకొచ్చారు. అమెరికా చట్టాలు ప్రకారం.. అక్కడ ఎవరు పుడితే వారు అక్కడి సిటిజన్ అని అన్నారు. అక్కడి చట్టాన్ని ధిక్కరించి క్యాన్సిల్ చేసే అధికారం ట్రంప్‌కు లేదన్నారు. ఈ విషయంలో అక్కడి ప్రజలకు ఫాల్స్ వాగ్దానాలు ఆయన చేశారన్నారు.
నేను దేశం కోసం పోరాడుతున్నా: కేఏ పాల్
ప్రధాని మోదీ ఎందుకు ఈ విషయంపై నోరు విప్పడం లేదు
మోదీకి చేతకాకపోతే రాజీనామా చేసి అమిత్ షాని ప్రధానిని చేయండి
– కేఏ పాల్ https://t.co/drq1RQ5yNq pic.twitter.com/ImmJAuNFae
— BIG TV Breaking News (@bigtvtelugu) February 6, 2025