E-Paper
Advertisement

KA Paul: ఇరాన్-అమెరికా యుద్ధం.. కేవలం మూడురోజులే, కీలక విషయాలు బయటపెట్టిన కేఏ పాల్

KA Paul: ఇరాన్-అమెరికా యుద్ధం.. కేవలం మూడురోజులే, కీలక విషయాలు బయటపెట్టిన కేఏ పాల్
Advertisement

KA Paul: ట్రెండ్‌ని తనకు అనుకూలంగా మలచుకోవడంతో సిద్ధహస్తులు ప్రజాశాంతి చీఫ్ కేఏ పాల్. గల్లీ నుంచి న్యూయార్క్ వరకు ఏ విషయానైనా అనర్గళంగా మాట్లాడడంలో ఆయన దిట్ట. ఈ విషయంలో ఆయనకు ఎవరూ సాటి రారు. తాజాగా ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధం గురించి కీలక విషయాలు బయటపెట్టారు. మూడు రోజుల్లో యుద్ధానికి ఫుల్‌స్టాప్ పడుతుందని చెప్పకనే చెప్పారు.

ఇరాన్-అమెరికా యుద్ధం గురించి పాల్ కీలక వ్యాఖ్యలు

Advertisement

ప్రస్తుతం అమెరికాలోని మియామిలో ఉన్న ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్.. కీలక విషయాలు బయట పెట్టారు. యుద్ధం ఆపడానికి శాంతి చర్చల్లో తాను బిజీగా ఉన్నానని తెలిపారు. ఈ ప్రాంతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏర్పాటు చేసిన సమావేశానికి 300 మంది ప్రతినిధులు హాజరయ్యారని, అందులో తాను కూడా ఒకడినని తెలిపారు. యుద్ధం గురించి కీలక విషయాలు బయటపెట్టారు ఆయన.

ట్రంప్ అల్లుడు యూదుడని, ఇజ్రాయెల్‌లో ఎక్కువమంది అంతా వారేనని అన్నారు. అక్కడున్నవారులో దాదాపు 80 శాతం మంది యుద్ధం కోరుకోవడం లేదన్నారు. యుద్ధం కేవలం గల్ఫ్‌లోని కొన్ని దేశాలు యూఏఈ, సౌదీ అరేబియాతోపాటు మరో రెండు దేశాల అధినేతలు ఇచ్చిన డబ్బులతో ఈ యుద్ధం జరుగుతోందన్నారు. ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కాదన్నారు.

Advertisement

కేవలం మూడురోజులే, కీలక విషయాలు బయటపెట్టిన కేఏ పాల్

యుద్ధం ఆపడానికి సోమవారం వరకు డెడ్ లైన్ ఇచ్చామని, మంగళవారం నాటికి ముగింపుకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఇప్పటివరకు ఏడుగురు టాప్ నేతల్లో ఐదుగుర్ని కలిశానన్నారు. శాంతి చర్చలకు ఇరాన్ నాయకులు అంగీకరించారని తెలిపారు. ఇరాన్ కొత్త సుప్రీం ఖమేనిని చంపుతామంటే ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం ఆగాలంటే తొలుత ప్రార్థనలు చేయాలన్నారు. అసలు విషయాలు తాను చెబుతున్నానన్న కారణంతో తన వీడియోలు తొలగించారని అన్నారు. 148 కోట్ల మంది ప్రజలకు గ్యాస్ లేకుండా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. యుద్ధం వస్తుందని సంకేతాలు వచ్చినప్పుడు మన నేతలకు ముందు చూపు ఎందుకు లేదని ప్రశ్నించారు.

ALSO READ: వారానికో స్కూల్లో ఎమ్మెల్యేల భోజనం.. టీచర్లే మొదట రుచి చూడాలి: మంత్రి లోకేష్

తాను మాట్లాడిన మాటలు నిజం కాలేదా? అంటూ ప్రశ్నించారు. నాయకులు కావాల్సినంత సంపాదించుకున్నారని, మనలాంటి సాధారణ ప్రజలను ఎవరూ పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. దేవుడి దయవల్ల తీర్పు వారికి అనుకూలంగా ఉంటుందన్నారు. ఇలాంటి నాయకులు ఎన్నుకున్నందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికైనా మార్పు రావాలన్నారు. మంచి మార్పు రావాలంటే మనమే తేవాలన్నారు. యుద్ధం నేపథ్యంలో గతంలో పాల్ వివిధ దేశాల నేతలతో దిగిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

 

Related News

విషం కక్కుతున్నారు.. వారిని అస్సలు వదిలిపెట్టం, జగన్‌కు లోకేష్ మాస్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, రాబోయే రెండురోజుల్లో..

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, రికార్డు స్థాయిలో ఆదాయం

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ప్రమాదం.. తెగిపోయిన గేటు ఇనుప రోప్

సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. అశోక్, వెంకటరాజు కస్టడీపై కోర్టు ఏం చెప్పిందంటే?

టీడీపీ పార్టీలో చేరాక తొలిసారి స్పందించిన చిన్న శ్రీను.. ఏమన్నారంటే?

బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం

బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?

Big Stories

Advertisement
×