Fenugreek Water: మెంతి గింజలు దాదాపు ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటాయి. మెంతులు ఔషధ గుణాలతో నిండి ఉన్నాయి. రోజు ఖాళీ కడుపుతో మెంతి గింజల నీటిని తాగడం వల్ల శరీరానికి గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి.
భారతీయ వంటగదిలో మెంతి గింజలు చాలా ముఖ్యమైన మసాలా.మెంతి గింజలు ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. అంతే కాకుండా ఆయుర్వేదంలో కూడా వీటికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. మెంతి గింజలు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. అంతే కాకుండా జీర్ణ సమస్యలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. మెంతి గింజల నీరు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో మెంతి నీరు త్రాగడం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.
మెంతి గింజల నీరు గుండె ఆరోగ్యానికి కూడా మంచిదని చెబుతుంటారు. ఇది చర్మానికి కొత్త మెరుపును అందిస్తుంది. మీరు మెంతి గింజలను నమిలి దాని నీటిని తాగితే మీరు అనేక సానుకూల ప్రయోజనాలను పొందవచ్చు.
మెంతి గింజల నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు :
జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది:
మెంతికూరలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా ఇది మలబద్ధకం, అసిడిటీ , గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది:
మెంతి గింజల్లో ఉండే పీచు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఇది మిమ్మల్ని తక్కువ తినేలా చేస్తుంది. అంతే కాకుండా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. శరీరంలో మెటబాలిజంను పెంచి బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. బరువు తగ్గాలని అనుకునే వారు మెంతి గింజల నీరు త్రాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది:
డయాబెటిక్ రోగులకు మెంతులు చాలా మేలు చేస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఒక వరం అనే చెప్పాలి.
గుండె ఆరోగ్యానికి మంచిది:
మెంతికూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
చర్మానికి మేలు చేస్తుంది:
మెంతులు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది చర్మం యొక్క వాపు ,ఎరుపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మొటిమలు , మచ్చలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. చర్మ సంబందిత సమస్యలు ఉన్న వారు మెంతులతో తయారు చేసిన నీరు త్రాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
జుట్టుకు మేలు చేస్తుంది:
మెంతులు జుట్టుకు కూడా చాలా మేలు చేస్తాయి. ఇది జుట్టును బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అంతే కాకుండా జుట్టును మెరిసేలా చేస్తుంది. మెంతిగింజలను పేస్ట్ లాగా చేసుకుని తలకు పట్టించడం వల్ల కూడా జుట్టు రాలకుండా ఉంటుంది. అంతే కాకుండా జుట్ట ఒత్తుగా కూడా పెరుగుతుంది.
మెంతి నీళ్ళు ఎలా తయారు చేయాలి ?
ఒక చెంచా మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి.
ఈ నీటిని వడపోసి ఉదయాన్నే ఖాళీ కడుపుతో త్రాగాలి.
మెంతి నీరు చాలా ప్రయోజనాలను కలిగి ఉందని గమనించండి. కానీ దీనిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
మీకు ఏవైనా అలెర్జీలు ఉంటే, మెంతులు తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండండి.
Also Read: బట్టతలపై కూడా జుట్టు రావాలంటే.. వీటిని పక్కా వాడాల్సిందే !
ఇతర ప్రయోజనాలు:
మెంతులు ఎముకలను బలపరుస్తాయి.
ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఇది క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడుతుంది.