ECIL Road Accident: ఇది హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ రోడ్డు.. మూడు రోజుల క్రితం జరిగిన సీన్. టైమ్ అర్ధరాత్రి. హోటల్‌లో ఏడుగురు వెయిటర్ల డ్యూటీ ముగించుకొని ఇంటి బాట పట్టారు. మధ్యాహ్నం నుంచి హోటల్‌లో నిలబడి.. ఆ టేబుల్ ఈ టేబుల్ చుట్టూ చక్కర్లు కొట్టారు. కస్టమర్ల ఆర్డర్లను టేబుల్‌పై పేర్చి వాళ్లు కడుపునిండా తింటే వీళ్లు మురిసిపోతారు. అలాంటి ఏడుగురు వెయిటర్లు డ్యూటీ ముగించుకొని అలసిన కాళ్లతో రోడ్డెక్కారు. అప్పుడే స్పీడ్‌గా దూసుకొచ్చింది ఓ కారు.. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే.. వాళ్లపైకి దూసుకెళ్లింది. రోడ్డంతా హాహాకారాలు, రక్తం చుక్కలు, కేకలు. వెయిటర్లు గాయాలతో విలవిల్లాడిపోయారు.
పోలీసులు కేసు నమోదు..
ఇక్కడే అసలు ట్విస్ట్. ఇది ప్రమాదమా? పగతో కూడిన ప్రతీకారమా? ఈ అనుమానం ఎందుకొచ్చిందంటే.. ప్రమాదానికి కొద్దిసేపటి ముందే ఆ బార్‌లో వెయిటర్లతో వీడు గొడవ పడ్డాడట. అంతేకాదు, గతంలోనూ మందు మత్తులో వెయిటర్లపై చేయి చేసుకున్న హిస్టరీ వీడిదని టాక్. అంటే.. డ్యూటీ అయ్యే వరకు కాచుకుని, కసి తీర్చుకున్నాడా? ఇదే ఇప్పుడు అందరి మెదళ్లలో తిరుగుతున్న ప్రశ్న. ఇడియట్.. నీ కోపానికి ఇన్ని కుటుంబాల కడుపు కొట్టావా? షేమ్ ఆన్ యూ. బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో వాడు ఫుల్లుగా తాగి ఉన్నాడని తేలిపోయింది. పోలీసులు కేసు పెట్టి, సీదా రిమాండ్‌కి తరలించారు.
Also Read: కాకినాడ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. చాట్‌జీపీటీ సాయంతో ప్లాన్.. అసలు సూత్రధారి అతడే!
ఇది కదా కర్మ ఫలం అంటే..
అసలు కారు నడిపింది ఎవడంటే.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అమెరికా వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు.. ఫ్లైట్ ఎక్కి అమెరికాలో ల్యాండ్ కావాల్సినోడు.. కోర్టుకు వెళ్లి పోలీస్ వ్యాన్ ఎక్కి.. నేరుగా జైలులో ల్యాండ్ అయ్యాడు. ఇది కదా కర్మ ఫలం. వీసా వచ్చింది, కానీ విజన్ లేదు. అసలు ఆ రాత్రి నిజంగా జరిగింది ప్రమాదమా? పగతో వేసిన స్కెచ్చా? అన్నది పోలీసులు తేల్చాలి.