BigTV English
Advertisement

Kakinada News: భార్య వేధింపులు.. భర్త ఆత్మహత్యాయత్నం, సంచలనం రేపిన ఘటన ఎక్కడ?

Kakinada News: భార్య వేధింపులు.. భర్త ఆత్మహత్యాయత్నం, సంచలనం రేపిన ఘటన ఎక్కడ?

Kakinada News: ఎక్కడైనా భార్యకు భర్త లేదా అత్తింటి నుంచి వేధింపులు ఉండడం తరచూ వార్తల్లో వింటుంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్. భార్య వేధింపుల తట్టుకోలేక భర్త ఆత్మహత్యకు ప్లాన్ చేశాడు. చివరకు ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. సంచలనం రేపిన ఈ ఘటన కాకినాడలో వెలుగుచూసింది. అసలేం ఏం జరిగిందన్న డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్దాం.


లోకేషన్ కాకినాడలోని సూర్యనారాయణపురం.. బాధితుడు వెంకటరమణ. స్థానిక మెడికల్ స్టోర్‌‌లో పని చేస్తున్నాడు. ఏమైందో తెలీదుగానీ ఈనెల 10న అర్థరాత్రి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు బాధితుడ్ని ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేయించారు. కోలుకుంటున్న వెంకటరమణ, ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. బాధితుడు ఆత్మహత్యాయత్నం వెనుక అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

సూర్యనారాయణపురంలో ఉంటున్న వెంకటరమణకు రెండేళ్ల కిందట త్రివేణితో మ్యారేజ్ అయ్యింది. పెళ్లి జరిగి ఏడాది జరిగినా పిల్లలు పుట్టలేదంటూ ఆయనపై వేధింపులు మొదలయ్యాయి. పిల్లలు విషయంలో భార్యభర్తల మధ్య తరచు గొడవలు జరుగుతున్నాయి. వీరి మధ్య రోజురోజుకూ సమస్య జఠిలమవుతోంది.


చివరకు గతేడాది ఆలుమగల వ్యవహారం పోలీసుస్టేషన్ వరకు వెళ్లింది. చివరకు పెద్దల సమక్షంలో భార్యభర్తలు రాజీపడ్డారు. ఇంతవరకు బాగానే జరిగింది. అసలు తతంగం ఇక్కడి నుంచే మొదలైంది.

ALSO READ: దేవరగట్టులో బన్నీ ఉత్సవం.. కర్రల ఫైటింగ్‌లో హింస.. 70 మందికి గాయాలు

కొద్దిరోజులుగా తన భార్య త్రివేణి రాత్రి వేళ ఊహించని టార్చర్ పెడుతోందని వాపోతున్నాడు బాధితుడు. లైంగికంగా వేధించడం, ప్రైవేట్ పార్ట్స్‌పై కొట్టడం లాంటి వికృత చేష్టలకు పాల్పడుతోందని కంటతడి పెడుతున్నాడు. ఈ వ్యవహారం కాస్త తీవ్రమై ఘర్షణలకు దిగుతోందని ఆరోపించారు. త్రివేణిని ఎదురిస్తే ఫ్యామిలీపై గృహ హింస చట్టం కింద కేసు పెడతామని అత్తింటివారు బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.

ఈ సమస్య నుంచి గట్టెక్కే మార్గం లేక చావే శరణ్యమని భావించి చివరకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానన్నది బాధితుడి వెర్షన్. తన భార్య నుంచి తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు భార్య బాధితుడు వెంకటరమణ.

 

 

 

 

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×