BigTV English

Atul Subhash Suicide: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసు.. భార్య, కుటుంబ సభ్యులు అరెస్ట్

Atul Subhash Suicide: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసు.. భార్య, కుటుంబ సభ్యులు అరెస్ట్

Atul Subhash Suicide| బెంగుళూరులో వారం రోజుల క్రితం అతుల్ సుభాష్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భార్య పెట్టే వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని అతుల్ సుభాష్ 24 పేజీల సూసైడ్ నోట్ రాసి పెట్టి మరీ చనిపోయాడు. ఈ కేసులో విచారణ చేపట్టిన బెంగుళూరు పోలీసులు అతుల్ భార్య నికితా సింఘానియా, ఆమె కుటుంబ సభ్యులను శనివారం డిసెంబర్ 14, 2024న అరెస్టు చేశారు.


ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని జౌన్ పూర్ జిల్లాకు చెందిన నికితా సింఘానియాపై తన భర్త అతుల్ సుభాష్‌ని ఆత్మహత్య చేసుకునేంతగా వివశుడిని చేసిందని మృతుడి సోదరుడు కేసు పెట్టాడు. దీంతో పోలీసులు ఈ కేసులో విచారణకు హాజరు కావాలని నికితా, ఆమె తల్లి, సోదరుడు, చిన్నాన్నకు మూడు రోజుల క్రితం నోటీసులు పంపించారు. కానీ వారు హాజరకాకపోవడంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి వారిని అరెస్టు చేయడానికి వెళ్లారు.

పోలీసులు వస్తున్నారని ముందుగానే తెలుసుకున్న నికితా సింఘానియా, ఆమె తల్లి, సోదరుడు జౌన్ పూర్ నుంచి పరారయ్యారు. అయినా వారి మొబైల్ లొకేషన్ ట్రాక్ చేసి పోలీసులు పట్టుకున్నారు. నికితా సింఘానియాని ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ వద్ద నుంచి పోలీసులు అరెస్ట్ చేయగా.. ఆమె తల్లి నిషా సింఘానియా, సోదరుడు అనురాగ్ సింఘానియాని అలహాబాద్ నుంచి అరెస్టు చేశారు. కానీ నికితా చిన్నాన్న సుశీల్ సింఘానియా మాత్రం పరారీలోనే ఉన్నాడని పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన ముగ్గురినీ శనివారం రాత్రి బెంగుళూరుకు తీసురావడం జరిగిందని సమాచారం.


Also Read:  ప్రభుత్వ ఉద్యోగి కిడ్నాప్.. గన్‌తో బెదిరించి యువతితో వివాహం

అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకునే ముందు 80 నిమిషాల వీడియో, 24 పేజీల సూసైడ్ నోట్ రాసి పెట్టి మరీ చనిపోయాడు. ఆ వీడియోలో, సూసైడ్ నోట్ లో తనను భార్య, ఆమె కుటుంబసభ్యులు ఎంతా వేధించారో వివరంగా రాశాడు. వీటికి తోడు చట్టం మహిళలకు పక్షపాతంగా ఉందని.. పురుషులను వేధించడానికి ఈ చట్టాలు దుర్వినియోగమవుతున్నాయని అతుల్ ఆవేదన వ్యక్తం చేశాడు.

34 ఏల్ల అతుల్ సుభాష్(Atul Subhash)  బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్‌కు చెందినవాడు. సూసైడ్ నోట్ ప్రకారం.. 2019లో మాట్రిమోనీ వెబ్ సైట్ ద్వారా నికితా సింఘానియాను కలుసుకొని వివాహం చేసుకున్నాడు. ఏడాదిత తరువాత వారిద్దరికి ఒక కొడుకు కూడా పుట్టాడు. అతుల్ సుభాష్ సంపాదన లక్షల్లో ఉండడంతో అతని భార్య నికిత, సోదరుడు బిజినెస్ ప్రారంభించడానికి రూ.1 కోటి అడిగారు. కానీ అతుల్ అందుకు అంగీకరించకపోవడంతో 2021 సంవత్సరంలో భార్యభర్తలు గొడవపడ్డారు. చివరికి నికిత తన పుట్టింటికి వెళ్లిపోయింది.

ఆ తరువాత నుంచి అతుల్, అతని తల్లిదండ్రులపై కట్నం వేధింపుల కేసు పెట్టింది. కట్నం వేధింపుల వల్లే నికిత తండ్రి చనిపోయారని కేసులో పేర్కొంది. అతుల్, అతని తల్లిదండ్రులు తనను నిర్దాక్షిణ్యంగా కొట్టేవారని గృహ హింస కేసు పెట్టింది. తనకు అతుల్ నుంచి విడాకులు కావాలంటూ భరణం కింద రూ.1 కోటి ఇప్పించాలని మరో కేసు పెట్టింది. పైగా ఈ కేసులన్నీ జౌన్ పూర్ కోర్టులో పెట్టడంతో గత మూడళ్లలో అతుల్ దాదాపు 40 సార్లు జౌన్ పూర్, బెంగళూరు మధ్య తిరిగేవాడు. కోర్టులో కట్నం వేధింపుల నకిలీ కేసులు పెట్టడం వల్ల చాలా మంది పురుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అతుల్ అందరిముందు చెప్పగా.. దానికి నికిత.. అలాగైతే తాను కూడా చచ్చిపోవాలని చెప్పడంతో న్యాయమూర్తి తనను అపహాస్యం చేశారని కూడా అతుల్ సూసైల్ నోట్ లో రాశాడు.

నికితా పెట్టిన కేసుల్లో జడ్డి మధ్య వర్తత్వం కోసం ఒక సారి రూ.20,000 మరోసారి రూ.40,000 లంచం తీసుకున్నారని, చివరగా రూ.5 లక్షలు ఇస్తే.. కేసే కొట్టివేస్తానని చెప్పినట్లు అతుల్ తీవ్ర ఆరోపణలు చేశాడు.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×