కడప కార్పొరేషన్లో 50 మంది కార్పొరేటర్లు ఉండగా.. 48 మంది వైసీపీ వాళ్లే.. ఇండిపెండెంట్ కూడా వైసీపీలో కలిసిపోయారు. ఒకరు టీడీపీ, ఒకరు ఇండిపెండెంట్ గా ఉన్నారు. అయితే 6 నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందే పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపారు. కడప ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి మాధవి గెలిచారు. తర్వాత పలువురు కార్పొరేటర్లు టీడీపీలోకి వస్తామని చెప్పినప్పటికి ఎమ్మెల్యే మాధవి, ఆమె భర్త శ్రీనివాసరెడ్డి సుముఖత వ్యక్తం చేశారు.
కడప వైసీపీలో జిల్లా అధ్యక్షుడు రవీద్రనాథరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎ అంజాద్ బాషా, మేయర్ సురేశ్ బాబు మధ్య మూడుముక్కల ఆట నడుస్తోంది. కడప అసెంబ్లీ స్థానంపై రవీంద్రనాథరెడ్డి ఎప్పటి నుంచో కన్నేశారు. ఇటీవలే మేయర్ సురేశ్ బాబుకు జిల్లా అధ్యక్ష పదవి తొలగించి ఆయనకు కట్టబెట్టారు. ఇప్పుడు కార్పొరేషన్లో రవీంద్రనాథరెడ్డి మేయర్ వర్గాలుగా పలువురు కార్పొరేటర్లు ముద్రపడ్డారు. మేయర్ సురేశ్ బాబు అనుచరుడిగా ముద్రపడ్డ సూర్యనారాయణ ఇప్పటికే టీడీపీలో చేరారు. ఇపుడు మేయర్, మాజీ డిప్యూటీ సీఎం, జిల్లా అధ్యక్షుడి వర్గంగా ముద్రపడ్డ కొందరు కార్పొరేటర్లు టీడీపీ గూటిలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
Also Read: క్రెడిట్ ఫైట్..! అల్లు అర్జున్‌కు బెయిల్ రావడంపై రెండు వర్గాల కొట్లాట
ముఖ్యంగా రెడ్డి కార్పొరేటర్లుగా ఉంటున్న కొందరు టీడీపీ జిల్లా అధ్యక్షుడితో టచ్లోకి వెళ్లి పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 15 మంది కార్పొరేటర్లు సైకిల్ ఎక్కనున్నారని సమాచారం. వీరందరిని ఒకేసారి కాకుండా వారం వారం టీడీపీలో చేరే విధంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఎంపీ అవినాశిరెడ్డి కడపలోని తన స్వగృహానికి రావాలంటూ పలువురికి ఫోన్ చేయడంతో కొందరు కార్పొరేటర్ల కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఐదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు తమను ఎవరు పట్టించుకోలేదని అవినాశ్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అంజద్ బాషా, మేయర్ సురేశ్ బాబుతో ఎంపీ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దీంతో అక్కడి రాజకీయం రసవత్తరంగా మారింది.