BigTV English

Kamalapuram Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. కమలాపురంలో రవీంద్రనాథ్ రెడ్డి గెలుపు ఖాయమేనా?

Kamalapuram Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. కమలాపురంలో రవీంద్రనాథ్ రెడ్డి గెలుపు ఖాయమేనా?
Kamalapuram Assembly Constituency

Kamalapuram Assembly Constituency : క‌మ‌లాపురం.. సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లాలోని నియోజకవర్గం. మాములుగానే కడప జిల్లా అంటే వైఎస్ కుటుంబానికి అనుకూలంగా ఉంటుంది. ఈ నియోజకవర్గానికి జగన్ మేనమామ పి. రవీంద్రనాధ్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో కమలాపుపరంలో వైసీపీ వేవ్ కనిపించింది. 2019 ఎన్నికల్లో ఏకంగా 55.89 శాతం ఓట్లు సాధించి ప్రత్యర్థి నర్సింహరెడ్డిపై జగన్‌ మేనమామ బరిలో గెలిచారు. మరి ఈసారి ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉండబోతుందన్నది ఓసారి పరిశీలిద్దాం.


2019 ఎన్నికల ఫలితాలు..
రవీంద్రనాథ్‌ రెడ్డి vs నర్సింహ రెడ్డి
YCP 56 శాతం
TDP 39 శాతం
OTHERS 5 శాతం

2019లో కూడా రవీంద్రనాథ్‌ రెడ్డినే బరిలోకి దింపింది వైసీపీ. ఆ ఎన్నికల్లో కనిపించిన జగన్‌ మ్యానియాతో ఆయన 17 శాతం మెజారిటీ ఓట్లతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 56 శాతం ఓట్లు పోలయ్యాయి. టీడీపీ నుంచి నాలుగోసారి బరిలోకి.. నాలుగోసారి కూడా ఓడిపోయారు నర్సింహరెడ్డి. ఆయనకు 39 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇతరులకు 5 శాతం ఓట్లు పడ్డాయి. గత ఎన్నికల్లో కమలాపురంలో వైసీపీ వేవ్ కనిపించింది. అయితే ఈ ఎన్నికల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రజల స్పందనేంటి? బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.


రవీంద్రనాథ్‌ రెడ్డి ( YCP) ప్లస్‌ పాయింట్స్‌
జగన్‌ మేనమామ అనే బంధం
గ్రౌండ్ లెవల్‌లో యాక్టివ్‌గా ఉండటం
పార్టీకి బలమైన మద్ధతు ఉండటం

రవీంద్రనాథ్‌ రెడ్డి మైనస్‌ పాయింట్స్‌
నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగకపోవడం
ప్రజలతో టచ్‌లో ఉండకపోవడం
ఎక్కువగా కడపలోనే ఉండటం

నర్సింహ రెడ్డి ( TDP) ప్లస్‌ పాయింట్స్‌
ఓడిపోతున్నా ఒకే పార్టీ నుంచి పోటీ చేయడం
పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం
ప్రభుత్వ తప్పులను జనాల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడం

నర్సింహ రెడ్డి మైనస్ పాయింట్స్‌
నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ బలంగా ఉండటం
జగన్‌ మేనమామతో తలపడటం

కులాల లెక్కలు..
రెడ్డి 35%
యాదవ్ 12%
ఎస్సీ 21%
ముస్లిం 15%

కమలాపురంలో అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గ ప్రజలు ఉన్నారు. 35 శాతం రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు ఉండగా.. ఇందులో 60 శాతం వైసీపీకి మద్దతుగా ఉండగా.. 40 శాతం టీడీపీ కూటమికి మద్దతుగా ఉన్నట్టు బిగ్‌ టీవీ సర్వేలో తేలింది. ఇక 12 శాతం ఉన్న యాదవ సామాజిక వర్గ ఓటర్లలో వైసీపీకి 40 శాతం సపోర్ట్‌ చేస్తుండగా.. 50 శాతం టీడీపీ కూటమికి మద్దతు పలుకుతున్నారు. మిగిలిన 5 శాతం ఇతరులకు ఓటు వేసే అవకాశం ఉంది. ఇక 21 శాతం ఉన్న ఎస్సీ సామాజిక ఓట్లలో కూడా మెజారిటీ అంటే 55 శాతం ఓట్‌ షేర్‌ వైసీపీకే అనుకూలంగా ఉంది. టీడీపీకి 35 శాతం, ఇతరులకు 10 శాతం మంది తమ మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్టు బిగ్‌ టీవీ సర్వేలో తేలింది. 15 శాతమున్న ముస్లింలలో వైసీపీకి 45 శాతం, టీడీపీకి 50 శాతం, ఇతరులకు 5 శాతం మద్దతు పలికే అవకాశం ఉంది.ఇక వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

రవీంద్రనాథ్‌ రెడ్డి vs నర్సింహ రెడ్డి
YCP 48%
TDP 44%
OTHERS 8%

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే… కమలాపురంలో మళ్లీ వైసీపీ జెండా ఎగిరే అవకాశమే ఉందని బిగ్‌ టీవీ సర్వేలో తేలింది. రవీంద్రనాథ్‌కు 48 శాతం, టీడీపీ నుంచి నర్సింహ రెడ్డి బరిలోకి దిగితే 44 శాతం, ఇతరులకు 8 శాతం ఓట్లు పడే అవకాశం ఉందని బిగ్‌ టీవీ సర్వేలో తేలింది.

.

.

Related News

Indrakiladri temple: విజయవాడ దుర్గమ్మ భక్తులకు షాక్.. కొత్త రూల్ పాటించాల్సిందే!

AP Heavy Rains: ఏపీకి భారీ వర్షసూచన.. గణేష్ మండపాల కమిటీ సభ్యులకు కీలక ప్రకటన జారీ!

Fire accident: వినాయక చవితి వేడుకల్లో అగ్నిబీభత్సం.. ప్రాణనష్టం తప్పి ఊపిరి పీల్చుకున్న భక్తులు.. ఎక్కడంటే?

YS Jagan: వాళ్లు ఫోన్ చేస్తే మీరెందుకు మాట్లాడుతున్నారు.. పార్టీ నేతలపై జగన్ ఫైర్!

AP Politics: గుంటూరు టీడీపీ కొత్త సారథి ఎవరంటే?

APSRTC employees: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ప్రమోషన్స్ పండుగ వచ్చేసింది!

Big Stories

×